అమెరికా వెళ్లాలని - అక్కడే స్థిరపడి కాసింత సొమ్ము వెనకేసుకోవాలని ఆశ పడే వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ఈ మేరకు పలురకాల వీసాలతో అమెరికా వెళ్లి కొంతకాలం తర్వాత తిరిగి వస్తుంటారు. అయితే అక్కడే స్థిర జీవనం గడపాలంటే మాత్రం గ్రీన్ కార్డు తప్పనిసరి. ఈ గ్రీన్ కార్డు రావడమనేది అంత ఈజీ కాదు. అయితే ఈ గ్రీన్ కార్డు ఎలాగైనా సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. పంజాబ్‌కు చెందిన నవదీప్ సింగ్ అనే వ్యక్తి ఇలానే అడ్డదారి తొక్కి అడ్డంగా బుక్కైపోయాడు.
పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన నవదీప్ సింగ్ అనే వ్యక్తి కేవలం గ్రీన్ కార్డు కోసమే అమెరికా పౌరసత్వం కలిగిన దేవిందర్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమెరికాలో స్థిరపడాలన్న నవదీప్ సింగ్ కోరిక తీరింది. అయితే పెళ్లైన కొంతకాలం మాత్రమే భార్యతో ఉన్న నవదీప్ సింగ్.. ఆ తర్వాత తన మావయ్య అమర్జిత్ సింగ్ దగ్గరకు మకాం మార్చాడు. దీంతో అనుమానం వచ్చిన దేవిందర్ కౌర్ అసలు విషయం తెలుసుకొని షాక్ అయింది. అతడికి ఇంతకు ముందే పెళ్లయిందని - కేవలం గ్రీన్ కార్డ్ కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది.
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న దేవిందర్ కౌర్ పంజాబ్ పోలీసులను సంప్రదించి నవదీప్ సింగ్ మోసం చేసిన తీరును వివరించింది. మాయమాటలు విని తాను నవదీప్‌ను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. దీంతో నవదీప్ సింగ్ - అతడి భార్య మంజీందర్ సింగ్ - మావయ్య అమర్జీత్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నవదీప్ - అమర్జీత్ అమెరికాలో ఉన్న కారణంగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.