ఉగ్ర‌వాదులకు షాక్‌..క‌శ్మీర్‌ లో ఎంద‌రు హ‌త‌మ‌య్యారంటే..

Update: 2020-06-07 15:59 GMT
దేశ స‌రిహ‌ద్దుల్లో క‌ల‌క‌లం సృష్టించాలనుకొని నిరంతరం ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారికి మ‌ళ్లీ షాక్ త‌గిలింది. జమ్ముకశ్మీర్‌ లోని షోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది.  రేబన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న జమ్ముకశ్మీర్‌ పోలీసుల సమాచారం మేరకు భద్రతాదళాలు ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపట్టారు. మొత్తం ఎంతమంది ఉగ్రవాదులున్నది తెలియరాలేదని - ఈ ఆపరేషన్‌ లో భారత భద్రతా దళాలకు ఎలాంటి నష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.

రేబన్ గ్రామంలో హిజ్బుల్ ముజాహిద్దన్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు - సీఆర్పీఎఫ్ జవాన్లు - రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సిబ్బంది కలిసి కూంబింగ్ చేపట్టారు. అయితే వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదుల హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు - మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు - భద్రతా సిబ్బందికి మధ్య ఎన్‌ కౌంటర్‌ ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని - పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

కాగా, రెండ్రోజుల క్రిత‌మే ఉగ్ర‌వాదుల‌కు షాక్ త‌గిలింది. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది - జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ ఫౌజీ భాయ్‌ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  పాకిస్థాన్‌ కు చెందిన ఫౌజీ భాయ్‌  ఐఈడీ బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతడు 2019 సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ పై ఉగ్రదాడి జరిగినపుడు పుల్వామాలో క్రియాశీలకంగా పనిచేశాడని పోలీసులు వెల్లడించారు. ఫౌజీ భాయ్‌ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ మేనల్లుడేనని తెలుస్తున్నది. దక్షిణ కశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఇతడితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు.


  


Tags:    

Similar News