దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం - నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఈ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన మందకృష్ణ సీఎం కేసీఆర్ ను తప్పుపట్టారు. మాజీ డీజీపీ హెచ్ జే దొర అత్మకథ పుస్తకావిష్కరణ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు సరికాదని ఆయన అన్నారు. ``మనుషులు కొన్ని సందర్భాల్లో మృగాలు గా మారతారు..... ప్రభుత్వం కొన్ని సమయాల్లో కటినంగా వ్యవహరించాల్సి వస్తుందని సీఎం అన్నారు. సీఎం కేసీఆర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ నీ సమర్ధించినట్లు మాట్లాడారు. ఈ అంశాన్ని సుప్రీం - హైకోర్టు - మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ చేయాలి ` అని మందకృష్ణ డిమాండ్ చేశారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను సీఎం కేసీఆర్ పరోక్షంగా - ప్రత్యేకంగా సమర్తించినట్టుగా ఉందని మందకృష్ణ అన్నారు. ఎన్ కౌంటర్ వెనక మా నాయకుడు తీసుకున్న నిర్ణయం ఉందని మంత్రి తలసాని అన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా....దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నిండు అసెంబ్లీలో అభినందించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎన్ కౌంటర్ జరిగింది అనేది తెలుస్తుంది` అని మందకృష్ణ పేర్కొన్నారు. కఠిన నిర్ణయాలు చట్టానికి లోబడి మాత్రమే తీసుకోవాలని మందకృష్ణ పేర్కొన్నారు. ``చట్టబద్ధంగా చేయకుంటే అవీ హత్యల కిందకే వస్తాయి. దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పోలీసులే నిందితులు. అయితే వాళ్లకు కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం మీద... రాజ్యాంగంపై గౌరవం ఉన్న వాళ్ళు ఇలా చేయరు` అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాలు సీఎం కేసీఆర్ కు కనబడటం లేదా అని మందకృష్ణ ప్రశ్నించారు. ``దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే మంచి పేరు వస్తుందని సీఎం కలలు కన్నారు. మానవహక్కుల కమిషన్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాం. అణగారిన వర్గాలపై ప్రభుత్వం చూపుతున్న వివక్ష పై మార్చి 8 తేదీన కొంగరకలాన్ లో ఎస్సీ - ఎస్టీ యుద్ధ భేరీ సభ నిర్వహిస్తాం.`అని మంద కృష్ణ అన్నారు.