బాబుకు తెలీని కొత్త కతా రేవంత్?

Update: 2016-07-15 00:30 GMT
ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ సీన్లోకి వచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని కోరుతూ ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము ధర్నా చేపడుతున్న విషయాన్ని తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గడిచిన 22 ఏళ్లుగా తాము ఈ అంశం మీద పోరాడుతున్నామని.. తాను చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మందకృష్ణ ఇచ్చిన వినతిపత్రాన్నిపరిశీలించిన రేవంత్.. ఈ ఇష్యూను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పారు. అయినా.. ఎస్సీ వర్గీకరణ గురించి చంద్రబాబుకు రేవంత్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తాను పవర్ లోకి రావటం ఆలస్యం తానే పెద్ద మాదిగనై.. ఎస్సీ వర్గీకరణ విషయంలో తానే ముందుండి సమస్యను పరిష్కరిస్తానని మాటలు చెప్పిన వైనం రేవంత్ మర్చిపోయినట్లున్నారు. అయినా.. ఎస్సీ వర్గీకరణ విషయం ఏమైనా బాబుకు తెలీని కొత్త కతా ఏంది?
Tags:    

Similar News