మున్సిపల్ పోరులో టీడీపీ కంచుకోట బద్దలు...25 ఏళ్ల అధిపత్యానికి ముగింపు !

Update: 2021-03-15 06:30 GMT
వైసీపీ .. వైసీపీ .. ప్రస్తుతం ఎక్కడ చుసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఎన్నిక ఏదైనా ,ప్లేస్ ఎక్కడైనా విజయం మాత్రం వైసీపీదే. ఫ్యాన్ గాలి జోరు ఎలా ఉంది అంటే , వైసీపీ దెబ్బకి గత కొన్నేళ్లుగా టీడీపీ కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సైతం టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై , వైసీపీ ప్రభుత్వం పై విపక్షాలు పదునైన విమర్శలు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా కూడా అవేమి కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు అని మున్సిపల్ ఎన్నికల ఫలితాలని చూస్తే అర్థమౌతుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నడూ చూడని ఫలితాలని చవి చూడాల్సి వచ్చింది. ఇదే నేపథ్యంలో వైసీపీ క్లీన్ స్వీప్ తో సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా చెప్పబడే మండపేటలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 30 వార్డుల్లో 22 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. పాతికేళ్ల టీడీపీ అధిక్యానికి ముగింపు పలుకుతూ  ఆ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు మాత్రమే గెలవటం గమనార్హం. టీడీపీ పెట్టిన తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణార్జునచౌదరి సతీమణి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీనే విజయాన్ని సొంతం చేసుకుంది. 1995, 2000, 2005, 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అయితే, ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు 10వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపులో కీలకం మండపేట. అలాంటిది, తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఇక్కడ పార్టీ మరి దారుణమైన ఫలితాలు సాధించడాన్ని టీడీపీ కార్యకర్తలు , అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే తరహా ఫలితాలు రాష్ట్రంలో చాలా చోట్ల రిపీట్ అయ్యాయి. 
Tags:    

Similar News