వేడుకలు - వినోదాల సందర్భాలను ఫేస్ బుక్ లో లైవ్ ఇస్తున్నారు... ఫేస్ బుక్ లైవ్ లో పాఠాలు చెబుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. దీన్ని తప్పుడు సందేశాలకూ ఉపయోగిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ లైవ్ ఇచ్చినవారున్నారు. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి ఏకంగా తాను చేసిన హత్యను ఫేస్ బుక్ లైవ్ లో చూపించి నేరాలకు ప్రేరేపించేలా వ్యవహరించాడు.
ఓ వద్ధుడిని అతిక్రూరంగా మర్డర్ చేస్తూ ఆ వీడియోను ఫేస్ బుక్ లైవ్ లో బ్రాడ్ కాస్ట్ చేశాడు అమెరికాలోని ఓహియోకు చెందిన స్టీవ్ స్టెఫెన్స్ . రాబర్ట్ గాడ్విన్ అనే 74 ఏళ్ల వ్యక్తిని స్టీవ్ హతమార్చాడు. ఆ హత్యను ఫేస్ బుక్ లో లైవ్ లో చూపించాడు. రాబర్ట్ గాడ్విన్ హత్య కంటే ముందు తాను మరో 13 మందిని హత్య చేసినట్టు, మరింతమంది తాను చంపబోతున్నట్టు ఫేస్ బుక్ లో మరో పోస్టులో హెచ్చరించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ నరరూపహంతకుడిని పట్టుకునే పనిలో పడ్డారు.
అయితే.. స్టీవ్ ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు... ఆయన లక్ష్యం ఎవరు అన్నది అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇలా తాను చేసిన హత్యలను ఫేస్ బుక్ లో చూపిస్తే మరింతమంది అలాంటి ప్రభావానికి లోనయ్యే ప్రమాదముందని అంటున్నారు. కాగా ఇది చాలా క్రూరమైన హత్యగా పరిగణించిన ఫేస్ బుక్ అధికార ప్రతినిధి - ఇలాంటి కంటెంట్ తమ ఫేస్ బుక్ లో రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఫేస్ బుక్ ద్వారా ఇలాంటి పెడ ధోరణులు స్ప్రెడ్ కాకుండా చూస్తామని చెబుతున్నారు.
కాగా... దారుణంగా హత్యకు పాల్పడుతూ వాటిని ఫేస్ బుక్ పోస్టు చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతేడాది జూన్ లో కూడా ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ వీడియో తీస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తిని 16 సార్లు షూట్ చేసిన ఘటన ఫేస్ బుక్ లైవ్ లో స్ట్రీమ్ అయింది. ఫేస్ బుక్ లైవ్-స్ట్రీమింగ్ ఫీచర్ తో ఏ వాస్తవ ఘటననైనా బ్రాడ్ కాస్ట్ చేసుకునే వీలును కంపెనీ కల్పించింది.దీంతో మర్డర్డు - అత్యాచారాలను కొంతమంది ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. ఇలాంటివి అరికడతామని ఫేస్ బుక్ చెబుతున్నా కూడా ఇంతవరకు సాధ్యం కాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/