ట్రాన్స్‌జెండ‌ర్‌తో పెళ్లి త‌ప్పు కాదు.. : మ‌ద్రాస్ హైకోర్టు షాకింగ్ వెర్డిక్ట్‌

Update: 2022-07-30 16:00 GMT
``నువ్వు ప్రేమించిన అబ్బాయి.. ట్రాన్స్‌జెండ‌ర్‌.. నిన్ను వేరేవారికి ఇచ్చి పెళ్లి చేస్తాం`` అని ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు బుజ్జ‌గించారు. కానీ, ఆమె మాత్రం నాకు ఆ అబ్బాయే కావాల‌నిప‌ట్టుబ‌ట్టింది. కానీ, వారు ఒప్పుకోలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి మ‌రీ.. ఆ ట్రాన్స్‌జెండ‌ర్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. క‌ట్ చేస్తే.. ట్రాన్స్జెండర్ను వివాహం చేసుకున్నందుకు ఓ యువతికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చిత్ర హింసలకు గురి చేశారు ఆమె బంధువులు. ఆమె భాగస్వామి హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

ఎవ‌రు..ఏమిటి.. ఎక్క‌డ‌?

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఓ మహిళ, ట్రాన్స్జెండర్ జంట ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే వీరి బంధాన్ని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు వారి వద్దకు బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. దీనిపై యువతి భాగస్వామి కోర్టును ఆశ్రయించగా వీరికి అనుకూలంగా తీర్చునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని దిండిగుల్ జిల్లాకు చెందిన యువతి విరుధ్నగర్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్ను ప్రేమించింది. వీరిద్దరూ ఈనెల 7న వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి తరఫు వారు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఈ నెల 16న ఈ జంట ఉంటున్న ఇంటిలోకి వచ్చిన బంధువులు.. యువతి, ట్రాన్స్జెండర్పై దాడి చేశారు. అనంతరం యువతిని వారి ఇంటికి తీసుకెళ్లిపోయారు.

యువతి బంధువులు ఆమె ఆలోచనను మార్చేందుకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారని ఆమె భాగస్వామి ఆరోపించారు. 'మా బంధాన్ని అంగీకరించమని వారు అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సోదరుడు తనను చిత్రహింసలు పెట్టాడు. నన్ను కూడా బెదిరించారు' అని ట్రాన్స్జెండర్ పేర్కొన్నారు.

యువతి భాగస్వామి ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా..  విచారణ చేపట్టిన జస్టిస్ పీఎన్ ప్రకాశ్, ఆర్ హేమలత ధర్మాసనం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'పిటిషనర్ గర్ల్ఫ్రెండ్కు 21 ఏళ్లు. ఆమె తన భాగస్వామితో కలిసి జీవించాలని అనుకుంటోంది. ఆ నిర్ణయానికి అడ్డుచెప్పలేము. త‌న‌కు ఇష్ట‌మ‌నప్పుడు.. మైనార్టీ తీరిన వారు.. ట్రాన్స్‌జెండ‌ర్‌ను పెళ్లి చేసుకోవ‌చ్చు.. స‌హ‌జీవ‌నం కూడా చేయొచ్చు`` అని హైకోర్టు పేర్కొంది
Tags:    

Similar News