కరెన్సీ ఎక్స్చేంజి కోసం బడాబాబులు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే బ్యాంకులు, ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డుకుంటున్నాయి. డ్వాక్రా మహిళలు, తాపీ మేస్త్రీలు, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి డబ్బు వేసి మార్చే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటిదే ఒక సంఘటన జరగ్గా బ్యాంకు అధికారులు ఆ ఖాతాను బ్లాక్ చేశారు.
యూపీలోని తాపీ మేస్త్రీకి చెందిన బ్యాంక్ అకౌంట్ లోకి అతనికి తెలియకుండానే రూ. 62 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యే సరికి... బ్యాంకు అధికారులు ఆ అకౌంట్ ను బ్లాక్ చేశారు.
ముంబైలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో కేవలం 7 వేలు మాత్రమే ఉండేది. దీపావళికి సొంత ఊరికి వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వాళ్ల ఊళ్లో లేకపోవడంతో, టికెట్ కోసం ఊరి సర్పంచ్ వద్ద నుంచి రూ. 200 చేబదులు తీసుకున్నాడు. తీరా ముంబై వచ్చాక ఏటీఎంకు వెళ్లి డబ్బు డ్రా చేయబోతే... అకౌంట్ క్లోజ్ అయిందని మెసేజ్ వచ్చింది. అంతేకాదు, అకౌంట్లో రూ. 62 లక్షలు జమ అయ్యాయని, అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వచ్చి వివరాలు ఇవ్వాలని అందులో ఉంది. దీంతో, బ్యాంకుకు వెళ్లిన అనిల్... ఆ డబ్బుకు, తనకు సంబంధం లేదని, తన సొంత సొమ్మును డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తే చాలని బ్యాంకు అధికారులను వేడుకున్నాడు. మొత్తం వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే కానీ ఖాతా మళ్లీ ఓపెన్ చేయబోమని అధికారులు ఆయనకు సెలవిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/