ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో క్వారీలో 40 మందికి పైగా కార్మికులున్నట్లు తెలుస్తోంది. వీరిలో భారీ పేలుడు సంభవించి పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం క్వారీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్వారీకి జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ప్రమాదవ శాత్తూ పేలినట్లు తెలుస్తోంది. క్వారిలో మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు ముక్కలై గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి.
ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ముగ్గురాయిని పేల్చేందుకు డిటొనేటర్ వాడుతారు. రోజువారీ పనిలో భాగంగానే డెటొనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40 మంది వరకు కూలీలు వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మృతదేహాలు గనిలో చిక్కుకుపోగా, బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పేలుడు ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.