సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శనివారం మధ్యాహ్నం 12.50గం. సమయంలో ఫ్యాక్టరీ ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీనితో భారీ పేలుడు ధాటికి కార్మికులంతా కకావికలమయ్యారు. కొందరు గాయాలతో కిందపడి అల్లాడుతున్నారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కంపెనీలో లోపల మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200-300 మంది కార్మికుల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లంచ్ బ్రేక్ సమయం కావడంతో ఎక్కువమంది బయటే ఉండటం భారీ ప్రమాదం తప్పిందంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుపోయింది. దీంతో స్థానికులెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు లోపల ఎంత మంది గాయపడ్డారు.క్షతగాత్రులయ్యారు ఎంత మంది పరిస్థితి విషమంగా ఉందనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధులు ఎవరూ చెప్పలేకపోతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.