మొండి సీఎం మొట్టు దిగారు

Update: 2017-03-31 07:30 GMT
అధికార ప‌గ్గాలు చేప‌ట్టడ‌మే ఆల‌స్యం త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకొన్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ త‌న నిర్ణ‌యాల‌ను కాస్త స‌డ‌లించుకుంటున్నారు. అక్ర‌మ క‌బేశాల‌ను మూసి వేయాల‌ని సీఎం యోగి నిర్ణ‌యం తీసుకున్న‌ నేప‌థ్యంలో వ్యాపారులు సమ్మె చేస్తున్నారు. అయితే మాంసం వ్యాపారుల నిరవధిక సమ్మె గత ఐదు రోజులుకు చేర‌డంతో ఎట్టకేలకు యూపీ సర్కార్‌ దిగివచ్చింది.

స‌మ్మెపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.  దీంతో రాష్ట్ర హైకోర్టు కూడా యోగి సర్కార్‌ కు మొట్టికాయలు వేసింది. వ్యాపారుల సమ్మెకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని యూపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడ్డార‌ని కొన్ని పార్టీలు ఆరోపించారు. యోగి ప్రభుత్వ  వైఖరిని విపక్షాలు పార్లమెంటులోనూ లేవనెత్తాయి.ఈ పరిణామాల నేపథ్యంలో దిగొచ్చిన సర్కార్‌ సమ్మె చేస్తున్న వ్యాపారులతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తో దాదాపు అరగంటపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. అక్రమ కబేళాల సాకుతో, అన్ని కబేళాలను  మూసివేయడం, అధికారుల వేధింపులకు నిరసనగా వ్యాపారులు గత ఐదు రోజులుగా చేస్తున్న స‌మ్మెను విర‌మిస్తున్నాయ‌ని శుక్రవారం నుంచి అన్ని దుకాణాలు యథావిధిగా తెరుచుకుంటాయని వారు ప్రకటించారు.  'మేము మా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. జాతి, మతం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండబోదని సీఎం హామీ ఇచ్చారు. దుకాణదారులు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, ప్రభుత్వం కబేళాలలో ఆధునీకరణ అవసరం గురించి మాట్లాడారని' మాంసం వ్యాపారులకు నేతృత్వం వహించిన ఖురేషీ చెప్పారు.

ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలను పాటించాలని వ్యాపారులకు ప్రభుత్వం త‌ర‌ఫున‌ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరాదని, భారతీయ నాగరికతను ముందుకు తీసుకెళ్ళడం ప్రతి పౌరుని బాధ్యత అని చర్చల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారని అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News