మీడియా కన్నంతా గాలి ఇంట పెళ్లిపైనే

Update: 2016-11-16 04:08 GMT
అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద వ్యాపారవేత్తగా.. రాజకీయ నేతగా ముద్ర పడిన గాలి జనార్దన్ రెడ్డి ఇంట జరుగుతున్న పెళ్లి సందర్భంగా మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు చూస్తే ఒకింత విస్మయం కలగక మానదు. మీడియా తీరు చూస్తే.. గాలి వారింట జరుగుతున్న పెళ్లి కార్యక్రమం ఏ మాత్రం నచ్చనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజల్ని ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉండటం.. గాలిని వేలెత్తి చూపించే అవకాశం ఉండటంతో తమకు లభించిన అవకాశాన్ని మీడియావదిలిపెట్టటం లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

అంగరంగ వైభోగంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం ఈ రోజు బెంగళూరులో జరగనుంది. ఈ పెళ్లి వేడుకలకు లక్షల్లో జనాలు వస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పెళ్లికి వచ్చే ముఖ్య అతిధుల కోసం బెంగళూరు ప్యాలెస్ చుట్టు పక్కల ఉన్న షాంగ్రిలా.. విండ్సర్ మానర్.. లీమెరిడియన్.. గ్రాండ్ అశోకా లాంటి ఫైవ్ స్టార్ హోటళ్లను గాలి ఫ్యామిలీ ఎప్పుడో బుక్ చేసింది.

పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశం మొత్తం మీదా ఉన్నా.. గాలి వారింట జరుగుతున్న పెళ్లి మీద మాత్రం పడటం లేదన్న ప్రచారం మీడియాలోభారీగా సాగుతోంది. దీంతో.. సామాన్యుడు సైతంఒక్కసారి గాలి వారి పెళ్లి మీద ఒక లుక్ వేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో నగదు లావాదేవీలకు సంబంధించిన ఆంక్షలున్న సమయంలో జరుగుతున్న భారీ వివాహ వేడుక కావటం మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటే.. మరోవైపు ఈ పెళ్లికి పెడుతున్న ఖర్చు లెక్కల మాటేమిటంటే మీడియా అడుగున్న ప్రశ్న కాస్త వింతగా.. విచిత్రంగా ఉందని చెప్పక తప్పదు.

నిజానికి ఆ పనిని ఐటీ శాఖ చేస్తుందన్నది మర్చిపోకూడదు. అందరి కంటిని ఆకర్షించే తన ఇంటి పెళ్లిని గ్రాండ్ గా చేయటం ద్వారా తనను టార్గట్ చేసే అవకాశం ఉందని గాలి జనార్దన్ రెడ్డి ఊహించకుండా ఉండరనుకోవటం తప్పే అవుతుంది. ఇప్పటికే పలు ఆర్థిక కేసుల్లోనేరస్తుడిగా ఉన్న ఆయనకు.. పెళ్లిని గ్రాండ్ గా చేస్తే వచ్చే తలనొప్పుల మీద ఆలోచించకుండానే ఈ తరహాలో పెళ్లి చేస్తారనుకోవటం తప్పే అవుతుంది.

పెళ్లి ఏర్పాట్ల గురించి వివరంగా చెబుతూనే..ఈ పెళ్లి కోసం గాలి తక్కువలో తక్కువ రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెబుతుంటే.. మరికొన్ని మీడియా సంస్థలు ఈ పెళ్లి ఖర్చును ఏకంగా రూ.500 కోట్ల వరకూ తీసుకెళ్లేసి విశ్లేషణలు చేయటం కనిపిస్తుంది. ఈ పెళ్లి కోసం దాదాపు 3వేల మంది బౌన్సర్లను నియమించినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్న గాలి వారింట జరుగుతున్న పెళ్లిపై పూర్తి నెగిటివ్ గా మీడియాలో ప్రచారం సాగటం కాస్త వన్ సైడెడ్ గా ఉందన్న విమర్శ వినిపిస్తోంది. నిఘా సంస్థలు చేయాల్సిన పనిని మీడియా తన వార్తలతో చేస్తుందని.. తప్పులు జరిగి ఉంటే ఆధారాలతో చెప్పాల్సింది పోయి.. చీకట్లో వేసే బాణాల మాదిరి కథనాలు అల్లుతూ తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని గాలి అండ్ కో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. ఇది కూడా ఒక పాయింట్టే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News