మీడియా సంస్థ‌ల‌కు ద‌డ‌గా మారిన కేసీఆర్ ముంద‌స్తు?

Update: 2018-08-27 14:30 GMT
ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నారా? అంటే.. ఉన్నాయ‌న్న మాట‌ను కొన్ని మీడియా సంస్థ‌లు బ‌ల్ల‌గుద్ది చెబుతుంటే.. మ‌రికొన్ని సంస్థ‌లు గోద మీద పిల్లి వాటంగా ఉన్నాయి. నిజం తెలిసినా.. ఒక‌వేళ చెప్పేస్తే.. రేపొద్దున తేడా వ‌స్తే జ‌రిగే న‌ష్టం గురించి ఆలోచిస్తున్న కొన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కానీ.. వారంతా మిస్ అవుతున్న లాజిక్ ఏమంటే.. ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం కార‌ణంగా జ‌రిగే డ్యామేజ్ మాటేమిటి?  దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరా?  ఏమ‌వుతుంద‌న్న సందేహంతో గోడ మీద పిల్లి వాటంగా వార్త‌లు రాస్తే..ఆ విష‌యాల్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకోలేనట్లుగా లేరు క‌దా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు వ్య‌వ‌హారంపై ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌.. అడ్డంగా ముంద‌స్తు లేద‌న్న మాట‌ను తేల్చేసిన రెండో రోజే.. ముంద‌స్తు ఉంద‌న్న విష‌యాన్ని చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌ముఖ ప‌త్రిక‌గా అంద‌రికి సుప‌రిచిత‌మై.. త‌న బ్రాండ్ ను గొప్ప‌గా.. తెలుగువారి గ‌ర్వానికి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించుకునే స‌ద‌రు సంస్థ కేసీఆర్ ముంద‌స్తుపై ఎందుకంత త‌ప్పులో కాలేసింద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ తో గేమ్ ఆడ‌కూడ‌ద‌న్న ఉద్దేశ‌మే ఇంత భారీ త‌ప్పున‌కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. స‌ద‌రు మీడియా సంస్థ యాజ‌మాన్యం తొంద‌ర‌ప‌డొద్ద‌న్న తీరుతో పాటు..ముంద‌స్తుపై కేసీఆర్ నిర్ణ‌యాన్ని బోల్డ్ గా రాస్తే.. ఆయ‌నెక్క‌డ హ‌ర్ట్ అవుతార‌న్న ఉద్దేశంతో పాటు.. రిపోర్టింగ్ వైఫ‌ల్యం కూడా తోడై.. ముంద‌స్తు వార్త‌ల విష‌యంలో స‌ద‌రు వార్తా సంస్థ బొక్క బోర్లా ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

వాస్త‌వానికి ఒక్క సంస్థే కాదు.. చాలా మీడియా సంస్థ‌లు కేసీఆర్ ముంద‌స్తును స‌రైన స‌మ‌యంలో స్మెల్ చేయ‌లేక‌పోయాన్న‌ది వాస్త‌వం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. కేసీఆర్ విష‌యంలో ఏం గెస్ చేసినా.. ఎప్పుడు ఏమైనా జ‌రిగే ఛాన్స్ ఉండ‌టం.. ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని ఇట్టే మార్చుకునే త‌త్త్వం.. త‌న‌కు ఇబ్బంది క‌లిగిన రోజున‌.. ఆ మీడియా.. ఈ మీడియా అన్న తేడా లేకుండా దూకుడుగా వ్య‌వ‌హ‌రించే తీరుతో ఎందుకొచ్చిన త‌ల‌నొప్పి అన్న ఉద్దేశ‌మే ముంద‌స్తుపై ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితే.. కేసీఆర్ ముంద‌స్తును స్మెల్ చేయ‌టంలో చాలా మీడియా సంస్థ‌లు వెనుక‌బ‌డి పోవ‌టం.. ఇప్పుడు ఆ విష‌యాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌టానికి కిందా మీదా ప‌డుతున్న వైనం ప‌లు ప‌త్రిక‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏమైనా.. కేసీఆర్ ముంద‌స్తు ముచ్చ‌ట ఏమో కానీ.. చాలా మీడియా సంస్థ‌ల‌కు ఇదో పెద్ద ఇబ్బందిగా మారింద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News