అంతకంతకూ తగ్గిపోవటం.. దీని కారణంగా సంతానభాగ్యం తగ్గిపోవటం..పిల్లల లేమి ఈ మధ్య కాలంలో అంతకంతకూ పెరిగిపోతోంది. యూత్ కి ఇదో సమస్యగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలనుకునే వారిలో ఎదురవుతున్న ఇబ్బందుల్లో వీర్య కణాల నాణ్యత సరిగా లేకపోవటం.
మరీ సమస్యకు పరిష్కారం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. దీనిపై పరిశోధనలు జరిపిన పరిశోధకులు సొల్యూషన్ ను చెప్పేశారు. వీర్యకణ నాణ్యతను పెంచుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదని.. తినే తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. వంధ్యత్వం అనేది ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారిందని.. 15 శాతం మందిపై దీని ప్రబావం చూపుతుందని తేల్చారు స్పెయిన్ లోని రొవిరా-ఐ-వర్జిలి వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం.
వీర్య కణాల నాణ్యత.. పునరుత్పత్తి రేటు మనం తీసుకునే ఆహారం మీద ఉంటుందని.. పండ్లు.. కూరగాయలు..చేపలు..తృణధాన్యాలు..సమృద్ధిగా కొవ్వు ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవటం ద్వారా వీర్యంలో నాణ్యతను పెంచుకునే వీలుందన్నమాటను చెప్పుకొచ్చారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల జాబితాలో కోళ్లు..కోడిగుడ్లు.. పీతలు.. ఆల్చిప్పల్లాంటివి..చేపలు.. సముద్రఆహారం సాయం చేస్తుందని చెప్పారు.
అదే సమయంలో శుద్ధి చేసిన ఆహారం..సోయా ఉత్పత్తులు..బంగాళదుంపలు.. వెన్న.. డెయిరీ ఉత్పత్తులు.. జున్ను.. కాఫీ.. మద్యం.. స్టాఫ్ట్ డ్రింక్స్..స్వీట్లు తినే వారిలో వీర్య కణ నాణ్యత తక్కువగా ఉంటుందని తేల్చారు. తాజా పరిశోధన ప్రకారం.. ఆలూ చిప్స్ దగ్గర నుంచి ఫ్రెంచ్ ప్రైస్ వరకూ.. కూల్ డ్రింక్స్.. స్వీట్లు.. కాఫీలు వగైరా వగైరా తీసుకోకూడదన్న మాట. చూస్తుంటే.. తాజా పరిశోదన బడా బడా కంపెనీల మీద గురి పెట్టినట్లుగా కనిపించట్లేదు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/