జన సైనికులుగా మారబోతున్న మెగా అభిమానులు

Update: 2022-06-06 08:53 GMT
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం మెగా అభిమాని సంఘాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీలో విలీనం కావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. మెగా అభిమాన సంఘాల్లోని ప్రముఖులతో నాదెండ్ల పెద్ద సమావేశమే పెట్టుకున్నారు. అభిమాన సంఘాలోని వారందరినీ మూడు నెలల్లోగా పార్టీలో కలిపేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

గ్రామం నుండి వార్డు స్థాయి వరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత పార్టీలో విలీనం అవ్వబోయే అభిమాన సంఘాల సభ్యులు తీసుకోవాలని కోరారు. పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యవర్గంతో మమేకం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అయినా పవన్ను సీఎం చేయాలనే బాధ్యత ముందు మిగిలిన విషయాలన్నీ చాలా చిన్నవన్నారు. జిల్లా నుండి మండల స్ధాయివరకు ఇలాంటి సమావేశాలు ఇంకా చాలా పెట్టుకోవాలన్నారు.

పార్టీలపరంగా ఎవరికెన్ని సీట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే రాష్ట్రంలో అధికారమార్పిడి జరగాలి వైసీపీ ప్రభుత్వం పోవాలని అనే టార్గెట్ తో అందరు పనిచేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటేనే జనాలంతా విసిగిపోయారని చెప్పారు.

ప్రభుత్వంపై జనాలంతా విసిగిపోయారనేందుకు తన దగ్గరున్న ఆధారాలేమిటో మాత్రం నాదెండ్ల చెప్పలేదు. ప్రభుత్వంపై జనాలంతా మండిపోతున్నారు, తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలనే నాదెండ్ల కూడా రిపీట్ చేస్తున్నారు.

జగన్ రెడ్డి ప్రజలను దారుణంగా మోసంచేశాడట. ఇలాంటి ప్రభుత్వం మనుగడ సాగించకూడదన్న మంచి స్పూర్తితోనే పవన్ ముందుకొచ్చినట్లు నాదెండ్ల చెప్పటమే విచిత్రంగా ఉంది. అదేదో పవన్ ఇపుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళవుతోంది. జనసేన పెట్టిందగ్గరనుండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ రాజకీయాలు చేస్తున్నారు.

ఇపుడంటే జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు పవన్ ముందుకొచ్చారు బాగానే ఉంది. మరి జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా తీవ్రంగానే వ్యతిరేకించారు కదా.సరే నాదెండ్ల గోల ఎలాగున్నా పార్టీలో విలీనం అవబోతున్న మెగా అభిమానులు ఏమిచేస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News