మ‌గాళ్లు సూసైడ్ చేసుకోర‌న్న కేంద్ర‌మంత్రి

Update: 2017-06-30 04:49 GMT
కేంద్ర‌మంత్రి మేన‌కా గాంధీ వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు. మ‌గాళ్లు సూసైడ్ చేసుకోర‌ని ఆమె సూత్రీక‌రించారు. ఫేస్ బుక్ లో నిర్వ‌హించిన లైవ్ చాట్ లో ఆమె చేసిన‌వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాలుగా మార‌ట‌మే కాదు.. ప‌లువురి అభ్యంత‌రాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. లైవ్ చాట్ లో ఆమె వ్యాఖ్య‌ల్ని అక్క‌డిక‌క్క‌డే ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.

జాతీయ నేర గ‌ణాంకాల విభాగం నివేదిక ప్ర‌కారం 2016లో దేశంలో 1,33,623 మంది ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటే అందులో 68 శాతం మంది పురుషులే కావ‌టం గ‌మ‌నార్హం.

ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారిలో అత్య‌ధికులు (68శాతం మంది) మ‌గాళ్లే.  మ‌హిళ‌లకు ద‌న్నుగా ఉండ‌టం త‌ప్పేం కాదు కానీ.. ఆ పేరుతో పురుషుల్ని కించ‌పరిచేలా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భార్య‌ల‌తో విడిపోయిన భ‌ర్త‌లు.. వారికి ఇవ్వాల్సిన మ‌నోవ‌ర్తి ఇవ్వ‌టం లేద‌ని త‌మ శాఖ‌కు భారీగా కంప్లైంట్స్ వ‌స్తున్న‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు.

హ‌క్కుల్ని డిమాండ్ చేసే ముందు పురుషులు త‌మ బాధ్య‌త‌ల్ని తెలుసుకోవాల‌ని చెప్పిన మేన‌క‌.. కార్య‌క్ర‌మం మొత్తం మ‌గాళ్లను ఏదో ఒక‌ర‌కంగా త‌ప్పు ప‌ట్టేలా మాట్లాడ‌టం క‌నిపించింద‌ని చెబుతున్నారు. అయితే.. కార్య‌క్ర‌మం చివ‌ర్లో మాత్రం ఒక‌రు అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం పురుషుల ప‌ట్ల సానుకూల‌త వ్య‌క్తం చేసేలా వ్యాఖ్య చేయ‌టం విశేషం. మ‌హిళ‌ల‌కు ఉన్న‌ట్లే.. పురుషుల‌కు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి క‌దా? అని అడిగిన ప్ర‌శ్న‌కు సానుకూలంగా స్పందించారు. ఆ విష‌యం నిజ‌మేన‌ని.. పురుషుల‌కు ఒక మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయాల‌న్న సూచ‌న‌ను తాను ఆహ్వానిస్తాన‌ని ఆమె చెప్ప‌టం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News