ఆయనో దేశాధ్యక్షుడు. కానీ.. మోడీ మీద అభిమానంతో కారు డ్రైవర్ అవతారం ఎత్తాడు. నిజమే.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ తన అమెరికా పర్యటన అనంతరం మెక్సికో చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. భారత్ ను న్యూక్లియర్ సప్లైయర్ లో చేర్చేందుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న మోడీ కోరుకున్నట్లే మెక్సికో కూడా తన మద్దతును ప్రకటించింది.
మోడీ చేసిన దౌత్యానికి ఫలితంగా మెక్సికో మద్దతు భారత్ కు సొంతం కావటమే కాదు.. మరో తియ్యటి గురుతును భారతప్రధానికి లభించింది. రెండు దేశాధినేతల మధ్య సమావేశం ముగిసి.. మీడియా భేటీ పూర్తి చేసిన తర్వాత విందుకు బయలుదేరారు. మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్ కు బయలుదేరిన ఆయనకు అనుకోని అనుభూతి సొంతమైంది. మోడీ ప్రయాణించే కారును మెక్సికో దేశాధ్యక్షుడు పెనా నీటో స్వయంగా డ్రైవ్ చేయటం విశేషం.
తన దేశానికి వచ్చిన భారత ప్రధానిని అత్యంత మర్యాదపూర్వకంగా వ్యవహరించిన మెక్సికో దేశాధ్యక్షుడు తానే స్వయంగా హోటల్ కు తీసుకెళ్లంతో పాటు.. కలిసి శాఖాహార భోజనాన్ని చేశారు. మెక్సికోను 30 ఏళ్ల క్రితం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సందర్శించగా.. సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన భారత ప్రధానికి మెక్సికో ఘన స్వాగతం పలికింది. ఒక దేశ ప్రధాని ప్రయాణించే కారును మరో దేశాధ్యక్షుడు డ్రైవ్ చేయటానికి మించిన మర్యాద మరేం ఉంటుంది. మోడీ మేజిక్ అంటే ఇదేనేమో..?