లింక్ డ్ ఇన్ ను అమ్మటానికి అతనే కారణమట

Update: 2016-06-14 05:05 GMT
మరో భారీ డీల్ మొదలైంది. పలు రంగాల నిఫుణుల మధ్య అనుసంధానకర్తగా ఉండే లింక్ డ్ ఇన్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది.లింక్ డ్ ఇన్ ను రూ.1.75 లక్షల కోట్లకు కొనుగోలు చేసేందుకు రెఢీ అయ్యింది.ఈ డీల్ మైక్రోసాఫ్ట్ టేకోవర్ల జాబితాలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. గతంలో ఎన్నో కంపెనీల్ని టేకోవర్ చేసినా.. ఒక సంస్థ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించటం మాత్రం ఇదే తొలిసారి.

ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ డీల్ విషయంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. లింక్ డ్ ఇన్ ను సొంతం చేసుకోవటానికి మైక్రోసాఫ్ట్ గతంలోనూ ప్రయత్నించినా.. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కొద్ది కాలంగా తనదైన శైలిలో ప్రయత్నిస్తున్న సత్యనాదెళ్ల.. చివరకు తాను అనుకున్నది సాధించారని చెప్పాలి. తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ అభిమానినని.. లింక్ డ్ ఇన్ తో సరికొత్త అవకాశాల్ని క్రియేట్ చేస్తున్నట్లుగా సత్యనాదెళ్ల పేర్కొన్నారు.  ఈ డీల్ ఇష్యూను మొత్తంగా చూస్తే.. సత్య నాదెళ్ల కీలక భూమిక పోషించినట్లు చెప్పొచ్చు. ఆయనే కానీ పూనుకోకపోతే.. ఈ డీల్ ఓకే అయ్యేది కాదని చెప్పొచ్చు.
Tags:    

Similar News