షాక్‌.. ఇన్‌ స్టాగ్రామ్ కూడా హ్యాకే!

Update: 2017-09-03 11:53 GMT
కంప్యూట‌ర్లు హ్యాక్ అవుతుండ‌డం ఎప్ప‌టి నుంచో తెలిసిందే. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌జా స్పంద‌న‌కు గీటురాయిగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల‌నూ హ్యాక‌ర్లు విడిచి పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. వీటిలోని వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని హ్యాక‌ర్లు దొంగిలిస్తున్న‌ట్టు తాజాగా స‌మాచారం. వ్య‌క్తిగ‌త స‌మ‌చారం - అపురూప‌మైన ఫొటోలు - ఫోన్‌ నెంబ‌ర్లు వంటి వాటిని ఇన్‌ స్టాగ్రామ్‌ ను హ్యాక్ చేయ‌డం ద్వారా హ్యాక‌ర్లు చోరీ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల కాలంలో ఫేస్ బుక్‌ - ట్విట్ట‌ర్ ను మించి సామాజిక స్పంద‌న ఉన్న‌వారు ఎక్కువ‌గా ఇన్‌ స్టాగ్రామ్‌ ను వినియోగిస్తున్నారు.

వీటిలో త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాలు - విలువైన స‌మాచారం కూడా ఉంచుకునే అవ‌కాశం ఉంది. దీనిని హ్యాక‌ర్లు త‌మ‌కు అవ‌కాశంగా మ‌లుచుకుని వీటిని హ్యాక్ చేయ‌డం ద్వారా దోచుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లోని సుమారు 60 లక్షల అకౌంట్లలో ఉన్న ర‌హ‌స్య‌ సమాచారాన్ని చోరీ చేసినట్లు ఒక సైబర్‌ క్రిమినల్ వెల్ల‌డించ‌డాన్ని బ‌ట్టి.. ప‌రిస్థితి తీవ్ర‌త ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఈ హ్యాక‌ర్లు క‌న్నేసిన వారిలో  సెలబ్రిటీలు -  వ్యాపారవేత్తలు - యువత ప్ర‌ధానంగా ఉన్నారు. లక్ష్యంగా చేసుకుని ప్రపం‍చవ్యాప్తంగా  అకౌంట్ల సమాచార చోరీకి దిగినట్లు తెలుస్తోంది.  హై ప్రొఫైల్‌ వ్యక్తులు - కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారాన్ని త్వరలోనే విడుదల చేస్తామని హ్యాకర్లు ప్రకటించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీరు వెల్ల‌డించే స‌మాచారంతో ఎలాంటి ఉత్పాతం ఎదుర‌వుతుందో, ఎవ‌రు ఎలా చిక్కుల్లో ప‌డిపోతారోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.   ఇదిలా ఉండగా.. వెరిఫికేషన్‌ కానీ అకౌంట్లు హ్యాక్‌ కు గురై ఉండొచ్చని ఇన్‌ స్టాగ్రామ్‌ ప్రకటించింది.
Tags:    

Similar News