మొన్న కేసీఆర్.. నేడు కేటీఆర్ హీరోయిజం

Update: 2021-06-05 03:31 GMT
కరోనా మొదటి వేవ్ లో ఆసుపత్రులకు వెళ్లేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని ఒకటి కాదు రెండు సార్లు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ మధ్యనే కొవిడ్ నుంచి క్షేమంగా బయటపడి.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆయన.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించటం.. కొవిడ్ తో తీవ్ర ఇబ్బందికి గురై.. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు దగ్గరగా వెళ్లి వారికి ధైర్యం చెప్పిన కేసీఆర్ తీరు ఆసక్తికరంగా మారింది.

గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కాదు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ ఇదే రీతిలో వ్యవహరించిన కేసీఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. అప్పటివరకు కొవిడ్ ఎపిసోడ్ లో కేసీఆర్ తీరును విమర్శించిన వారు..వేలెత్తి చూపించిన వారంతా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. అంతేకాదు.. కొవిడ్ వార్డుల్ని సందర్శించే సమయంలో పీపీఈ కిట్.. చేతికి గ్లౌజ్ లాంటివి ఏమీ లేకుండా.. కేవలం డబుల్ మాస్కుకు పరిమితమైన వైనం అందరిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తండ్రికి తగ్గట్లే తనయుడు కేటీఆర్ సైతం టిమ్స్ లో అదేరీతిలో వ్యవహరించారని చెప్పాలి. తండ్రిని గుర్తుకు తెచ్చేలా డబుల్ మాస్కుకు పరిమితమయ్యారు. కొవిడ్ వార్డుల్లో ఉత్సాహంగా తిరిగిన ఆయన.. పేషెంట్లకు అతి సమీపానికి వెళ్లారు. వారిని పలుకరించటమే కాదు.. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మొత్తానికి తన తండ్రి చేసిన
Tags:    

Similar News