సోనూసూద్ .. కరోనా విజృంభణ సమయంలో ఓ ప్రైవేట్ గవర్నమెంట్ ను నడిపించాడు. ఏదైనా ఆపద వస్తే ప్రభుత్వాన్ని అడిగే ప్రజలు .. సోనూసూద్ ను అడిగితే ఆ సమస్య తీరిపోతుంది అనే నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. అన్నా నీ సహాయం కావాలి అంటే ఖర్చుకి వెనుకడుగు వేయకుండా అందరిని ఆదుకున్నాడు. కలియుగ కర్ణుడు అని చెప్పాలి. కరోనా విజృంభణ వేళ సినీనటుడు సోనూసూద్ చేసిన సేవలను తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నిస్వార్థపూరితంగా ఆయన సేవలు చేశారని చెప్పారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ లో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కొవిడ్ వారియర్స్ కు సన్మానం చేశారు.
ఇందులో కేటీఆర్, సోనూసూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు. అందుకే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని విమర్శలు చేశారు. సమాజంలో సవాళ్లు ఎదురైనప్పుడు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులూ చేయడం సాధ్యం కాదని చెప్పారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా తేలికేనని చెప్పారు. అయితే, బాధ్యతగా సేవలు చేయడం గొప్ప అని ఆయన అన్నారు.
సోనూసూద్ పేద ప్రజలకు సేవలు చేస్తోంటే ఆయన ఇళ్లు కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించి, ఆయనను భయపెట్టాలని అనుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయనకు సమాజంలో ఉన్న ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆయన వెంట తామంతా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. నేతలు అందరూ కేటీఆర్ లా ఉంటే తనలాంటి వారి అవసరం సమాజానికి ఉండదని కొనియాడారు. కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని ఆయన చెప్పారు. తాను దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేశానని వివరించారు.