తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న వాదనలను ఏపీ విద్యుత్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుబట్టారు.
విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్‌లకు ఆంధ్రప్రదేశ్ రూ.17,828 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసీఆర్ తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. అంతేకాకుండా ఇది తప్పయితే ఒక్క నిమిషంలోనే తన పదవిలోకి రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లను తమకు ఇవ్వాల్సిన రూ.17,828 కోట్లలో మినహాయించుకుని మిగిలిన సొమ్మును తమకు ఏపీ చెల్లించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసింది, నెల రోజుల్లోగా ఏపీ సరఫరా చేసిన విద్యుత్ కు రూ.6 వేల కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేక రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ మండిపడ్డారు. అయినవారికి ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అన్నట్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉన్న రూ.6 వేల కోట్లను చెల్లించడం లేదని పలు పర్యాయాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఏపీ మంత్రులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తదితర కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విన్నవించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన మరోలా ఉంది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రూ.17,828 కోట్లు బకాయిపడిందని ఆయన అంటున్నారు. ఈ మొత్తంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రూ.6,000 కోట్లు మినహాయించి, మిగిలిన బకాయిలను వీలైనంత త్వరగా తమకు చెల్లించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వాదనలు నిరాధారమైనవని, ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులను దండుకుని కేసీఆర్ రాజకీయ క్రీడలు ఆడుతున్నారని పెద్దిరెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. విద్యుత్ బకాయిల అంశాన్ని రాజకీయ అంశంగా కాకుండా రికార్డులను సరిచూసుకోవాలని, వాస్తవాలను అంగీకరించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలకు విఘాతం కలిగించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఇప్పుడైనా కేసీఆర్.. మంత్రి పెద్దిరెడ్డి సలహాకు అంగీకరిస్తారో, లేదో వేచిచూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.