ఆ సెక్స్ వీడియో వెన‌కున్న‌ది ఎవ‌రో నాకు తెలుసుః ర‌మేష్ జార్కి

Update: 2021-03-10 07:30 GMT
క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మాజీ మంత్రి ర‌మేష్ జార్కి సెక్స్ వీడియోల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేకెత్తించిందో అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో రాజ‌కీయంగా పెను దుమారం రేపిన ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా.. ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అయితే.. తాజాగా ఈ విష‌యంపై స్పందించిన ఆయ‌న.. ఈ వీడియో వెన‌క ఉన్న‌ది ఎవ‌రో త‌న‌కు తెలుస‌ని సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ర‌మేష్ జార్కి హోళి.. ఆ వీడియో ఫేక్ అని అన్నారు. ఆ వీడియో సీడీ గురించి త‌న‌కు నాలుగు నెల‌లు ముందుగానే తెలుస‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సీడీ విడుద‌ల‌కు ఒక రోజు ముందుగానే బీజేపీ నేత‌లు త‌న‌కు ఫోన్ చేసి అల‌ర్ట్ చేశార‌ని చెప్ప‌డం విశేషం. అంతేకాదు.. ఈ ఫేక్ వీడియో కుట్ర‌లో న‌లుగురు రాజ‌కీయ నాయ‌కులు, ముగ్గురు జ‌ర్న‌లిస్టులు, ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉండొచ్చ‌ని చెప్పారు. వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని వ్యాఖ్యానించారు ర‌మేష్‌.

కాగా.. ఈ విష‌య‌మై ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి హెచ్ డీ కుమార‌స్వామి కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఇదంతా ముంద‌స్తు ప‌థ‌కం ప్ర‌కార‌మే చేశార‌ని వ్యాఖ్యానించారు. ఈ సెక్స్ వీడియోల వెనుక రూ.5 కోట్ల డీల్ కుదిరింద‌ని బాంబు పేల్చారు. అయితే.. అది ఎవ‌రి మ‌ధ్య కుదిరింది? ఈ చర్య వెనకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అన్న‌ది మాత్రం ఆయన వెల్ల‌డించ‌లేదు.

అయితే.. ఫేక్ వీడియో గురించి నాలుగు నెల‌లు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఎందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌నే ప్ర‌శ్నిస్తున్నారు ప‌లువురు. అనుమానితుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. ఈ గొడ‌వే ఉండేది కాదుక‌దా..? అని అంటున్నారు. మ‌రి, ఈ ప్ర‌శ్న‌ల‌కు ర‌మేష్ ఏం స‌మాధానం చెబుతారో..?
Tags:    

Similar News