ఏపీ వైసీపీ నాయకురాలు.. ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి ఆర్.కె. రోజా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో జోష్ పెంచారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన ఆమె.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో మంత్రి ఆర్.కె. రోజా జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
ఈ పోటీలో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం క్రికెట్, ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప జేసీ వెంకటేశ్వర్, డీఈఓలు విజయేంద్ర, శేఖర్, ఆర్డీఓ సృజన, ఎమ్మార్వో చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు.
ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లోనూ మంత్రి రోజా దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. పలువేది కలపై ఆమె రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. గతంలో సినీ నటిగా, నృత్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్న ఆమె తర్వాత.. ఓ ఛానెల్ నిర్వహించిన జబర్దస్త్ మెగా షోలో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.
ఈ సమయంలోనే ఆమెకు.. సినిమాలకంటే ఎక్కువగా పేరు వచ్చింది. ఎమ్మెల్యేగా నగరి నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్న రోజా.. ఎక్కువ సమయం జబర్దస్త్‌లో ఉండడంతో ఆమెకు జబర్దస్త్ రోజా అనే పేరు కూడా రావడం గమనార్హం. మొత్తంగా ఇప్పుడు కబడ్డీ ఆడి అందరికీ కనువిందు చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View