స్కూల్ హాస్టల్ లో నలుగురమ్మాయిలకు ప్రెగ్నెన్సీ!

Update: 2019-07-02 10:23 GMT
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పే మరో సంఘటన ఇది. పక్క రాష్ట్రం ఒడిశాలోని ఒక ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ లో ఒకింత సంచలన సంఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే అమ్మాయిల హాస్టల్ లో ఏకంగా నలుగురు విద్యార్థినిలు గర్భవతులుగా తేలడం సంచలనంగా మారింది.

ఈ అంశం మహిళా కమిషన్ వరకూ వెళ్లింది. ఒడిశాలో ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు కామన్ అయిపోయాయట. వివిధ సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థినులు ఇలా గర్భవంతులుగా తేలుతున్నారట. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ లోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉదంతం సంచలనంగా మారింది.

ఇటీవలే వేసవి సెలవులు ముగిశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినిలు తిరిగి హాస్టల్స్ కు రాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఈ విషయం బయటపడింది. ఈ అంశంపై ప్రభుత్వాధికారులు సంప్రదించారు. ఇంకా మైనర్లే అయిన ఆ అమ్మాయిల పరిస్థితిపై అధికారులు స్పందించారు. ఈ సంఘటనలపై విచారణ జరిపించనున్నట్టుగా పేర్కొన్నారు. అవసరమైతే ఆ విద్యార్థినులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టుగా అధికారులు ప్రెకటించారు.

ఒకే హాస్టల్ కు సంబంధించి నలుగురు టీనేజర్లు ప్రెగ్నెంట్స్ కావడంతో అది అక్కడి వారి పనేనా లేక మరేదైనానా అనేది చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News