మంచు మనోజ్‌కు పోలీసుల షాక్.. అటువైపు రావద్దని ఆదేశం

అయితే.. పోలీసుల నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్ కాలేజీ దగ్గరకు వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Update: 2025-01-15 09:38 GMT
మంచు మనోజ్‌కు పోలీసుల షాక్.. అటువైపు రావద్దని ఆదేశం
  • whatsapp icon

సినీనటుడు మంచు మనోజ్‌కు పోలీసులు బిగ్ షాక్‌నిచ్చారు. మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజులుగా నువ్వా నేనా అన్నట్లుగా మోహన్ బాబు, మనోజ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా.. మనోజ్‌కు పోలీసులు నోటీసులివ్వడం చర్చకు దారితీసింది.

తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి మనోజ్ వస్తారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మంచు కుటుంబంలో కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే.. పోలీసుల నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్ కాలేజీ దగ్గరకు వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటు మోహన్ బాబు కాలేజీ వద్ద సైతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు కాలేజీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాలేజీకి మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను సిబ్బంది పూర్తిగా క్లోజ్ చేశారు. కాలేజీ వద్దకు సెక్యూరిటీ సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు.

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం సినీ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు ఏర్పడడం వల్లే మనోజ్ గొడవకు తెరలేపినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు.. ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇన్నేళ్లుగా లేని గొడవలు ఒక్కసారిగా తెరపైకి రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా సంక్రాంతి సంబరాలను మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు, ఆయన భార్య నిర్మలాదేవితోపాటు పెద్ద కొడుకు మంచు విష్ణుతో, ఆయన భార్య విరోనిక అలాగే పిల్లలు కలిసి సంబరంగా జరుపుకుంటున్నారు.

Tags:    

Similar News