రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి... కేంద్రం సీరియస్ డిమాండ్!

ఇదే సమయంలో.. బినీల్ సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు తెలిపారు.

Update: 2025-01-15 06:26 GMT

రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ (32) అనే యువకుడు మరణించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇదే సమయంలో.. బినీల్ సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు తెలిపారు.

ఈ విషయం తెలిసి బినిల్ భార్య షాక్ కు గురయ్యారని అంటూన్నారు. ఆయనను రష్యా నుంచి సేఫ్ గా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విసాద వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. బినిల్ మృతిచెందడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇందులో భాగంగా... బినిల్ మృతి చెందిన విషయాన్ని అటు మాస్కో లోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. ఇటు ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయ్యం అధికారులతోనూ మాట్లాడామని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడ నుంచి పంపించాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది.

ఇదే సమయంలో బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా... బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. మృతదేహాన్ని త్వరగా భారత్ కు రప్పించేందుకు రష్యాన్ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో గాయపడిన జైన్ ను ఇండియాకు పంపించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో పోల్ పెట్టారు.

కాగా... గతేడాది రష్యాలోని కజాన్ లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు సమయంలో ఈ అంశాన్ని భారత్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ – పుతిన్ మధ్య చర్చలు జరిగాయని అప్పట్లో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. రష్యా అంగీకరించడం వల్ల చాలా మంది భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News