రెండు గ‌దుల్లో ఉంటున్న నిజాం వార‌సుడు

Update: 2017-09-16 04:29 GMT
పేదోడికి సైతం తెలంగాణ ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్రూంను ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు.. చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్ని త‌న సంస్థానంలో ఉన్న ప్ర‌పంచ సంప‌న్నుల్లో ఒక‌రైన నిజాం ప్ర‌భువుల వార‌సుడు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి జీవితాన్ని గ‌డుపుతున్నారు? అన్న‌ది తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

దేశం కాని దేశంలో రెండు గ‌దుల్లో ఆయ‌న త‌ల‌దాచుకొని..బ‌తుకు బండి లాగిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన తాజా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్ప‌టికి హైద‌రాబాద్ వ‌స్తే 400 ఎక‌రాల్లో ఉండే చిరాన్ ప్యాలెస్ లో ఉండే ఆయ‌న‌.. విదేశాల్లో మాత్రం రెండు గ‌దుల్లో స‌ర్దుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఏడు త‌రాల పాటు హైద‌రాబాద్‌ ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలిన నిజాం న‌వాబుల వార‌సుడు.. ఫ్రాన్స్ లో పుట్టి లండ‌న్ లో చ‌దువుకొని.. భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చి 400 ఎక‌రాల విశాల స్థ‌లంలో నిర్మించిన చిరాన్ ప్యాలెస్ లో విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపిన నిజాం వార‌సుడు మిర్ బ‌ర్క‌త్ అలీ ఖాన్ అలియాస్ ప్రిన్స్ ముక్రం జా ఇప్పుడు ట‌ర్కీలోని రెండు గ‌దుల ఇంట్లో నివాసం ఉంటున్నారు.

ఆస్తి వివాదాల‌తో విసిగెత్తిపోయిన ఆయ‌న 1970ల‌లో విదేశాల‌కు వెళ్లిపోయారు. అద్భుత‌మైన రాజ‌ప్రాసాదం నుంచి ఆస్ట్రేలియాలోని 2 ల‌క్ష‌ల హెక్టార్ల ఫాంహౌజ్‌ కు త‌ర్వాత కాలంలో ట‌ర్కీకి చేరుకొని రెండు గ‌దుల ఇంట్లో నివాసం ఉండ‌టం విశేషం. అప్పుడ‌ప్ప‌డు హైద‌రాబాద్‌ కు చుట్టం చూపుగా వ‌చ్చి పోయే ఆయ‌న ఇప్పుడు రెండు గదుల ఇంట్లో నివాసం ఉంటున్నార‌న్న స‌మాచారం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏడ‌వ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆజంజాను (వ‌రంగ‌ల్ లోని ఆజం జాహీ మిల్స్ ఆయ‌న పేరు మీదే స్టార్ట్ చేశారు) కాద‌ని.. అత‌ని కొడుకైన త‌న మ‌న‌మ‌డు ముక్రంజాను వార‌సుడిగా ప్ర‌క‌టించారు. దాన్ని కేంద్రం ఓకే చేసింది. అయితే.. 1971లో రాజ‌భ‌ర‌ణాలను ఇందిరాగాంధీ ర‌ద్దు చేసే వ‌ర‌కూ బంజారాహిల్స్ లో 400 ఎక‌రాల్లో నిర్మించిన చిరాన్ ప్యాలెస్ లో నివాసం ఉండేవారు. పీవీ న‌ర‌సింహారావు సీఎం అయ్యాక భూ ప‌రిమితి చ‌ట్టంతో ఆయ‌న‌కు ఆరు ఎక‌రాలు మాత్ర‌మే మిగిలింది. ఆయ‌న నుంచి స్వాధీనం చేసుకున్న భూమితో ప్ర‌భుత్వం కాసు బ్ర‌హ్మానంద రెడ్డి జాతీయ పార్కుగా ప్ర‌క‌టించింది. ఉస్మాన్ ఆలీ ఖాన్ మ‌ర‌ణించిన త‌ర్వాత ప‌న్నుల భారం.. ఆస్తిలో హ‌క్కు కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌టం.. రాజ‌భ‌ర‌ణాల‌ను ర‌ద్దు చేయ‌టంతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.

మొత్తం ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఆయ‌న భార్య‌లు ఐదుగురు విదేశీయులే. మొద‌టి భార్య ట‌ర్కీకి చెందిన ఎస్రా. త‌న వెంట ఆస్ట్రేలియాకు రావ‌టానికి నో చెప్ప‌టంతో ఆమెకు విడాకులు ఇచ్చారు. 20 ఏళ్ల త‌ర్వాత ఆమె మ‌ద్ద‌తు కోర‌గా.. నిజాం ఆస్తుల ఆల‌నాపాల‌నా ఆమె చూస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స‌మావేశ‌మై.. ఆస్తుల వివాదాల గురించి మాట్లాడిన‌ట్లుగా చెబుతారు.  అదే స‌మ‌యంలో సౌదీ అరేబియా.. బ్రిట‌న్‌.. ఫ్రాన్స్ దేశాల్లోని త‌న ఆస్తుల గురించి ఆయ‌న ప‌ట్టించుకోవ‌టం లేద‌ని చెబుతారు.
Tags:    

Similar News