తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో లిప్టు తెగిపడిన ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లిప్టులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, 16 మంది సిబ్బంది, కార్యకర్తలు ఉన్నారు. ప్రయాణిస్తున్న లిఫ్టు ఒక్కసారిగా తెగిపడడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై గ్రిల్స్ తొలగించి మంత్రి తలసానిని కాపాడారు.
ఎర్రగడ్డ సెయింట్ థెరెస్సా ఆసుపత్రికి సోమవారం తలసాని వెళ్లారు. అక్కడ ఆయన రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోరుకు రావడానికి లిఫ్టు ఎక్కారు. మంత్రితో పాటు భద్రత సిబ్బంది, అనుచరులు కూడా లిఫ్టులో ఎక్కారు. దీంతో లిఫ్టులో మొత్తం 16 మంది ఉన్నారు. పాత లిఫ్టు కావడం... అధిక తాకిడి ఉండడంతో లిఫ్టు తెగిపడింది. ఈ ఘటనతో లిఫ్టులో ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు లోనయ్యారు. తలసానికి, లిఫ్టులో ఉన్న మిగిలినవారందరికీ కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. లిఫ్టు గ్రిల్సు తొలగించి తలసానికి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.