యువతలో ఎవరు మేటి? అమెరికన్ల, భారతీయులా?

Update: 2020-06-15 17:00 GMT
ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఉంటాయి.కానీ ఎవరు నెరవేర్చుకుంటున్నారు. ఎవరు ఉన్నతంగా ఎదుగుతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు గుగూల్, మైక్రోసాఫ్ట్ లు అమెరికా కంపెనీలైనా వాటిని నడిపించేది మాత్రం భారతీయులు కావడం విశేషం. అంటే మెరుగ్గా బతకడంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందంజలో ఉన్నారని అర్థమవుతోంది. తాజాగా అమెరికన్ యువతకు, భారతీయ యువతకు మధ్య పోల్చిచూస్తే ఎవరు బెటరో తేటతెల్లమైంది..

మిట్ అనే మీడియా సంస్థ, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిట్-సీపీఆర్ సర్వేను ఆన్ లైన్ లో 2020 మార్చిలో నిర్వహించారు. దాదాపు 184 పట్టణాలు, నగరాల్లో 10005 మంది యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేలో అమెరికా యువత ఎక్కువగా అప్పులు, తక్కువ ఆదాయాలు తక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలింది. కాగా భారతీయ యువత మాత్రం తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తున్నట్టు తేల్చింది. సర్వేలో పాల్గొన్న పదిలో ఎనిమిది మంది భారతీయులు తమ తల్లిదండ్రుల కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపడం విశేషం.

ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ యువతకు అత్యున్నత ఉద్యోగాలు లభించాయని.. అనుబంధాల విషయంలో తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. భారత దేశ యువత ఎక్కువగా విదేశాలకు, నగరాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారని సర్వే పేర్కొంది. లక్షకు పైగా జీతాన్ని సంపాదిస్తున్నట్టు సర్వేలో పాల్గొన్న మెజారిటీ యువత తెలిపింది. అమెరికన్ యువతలో ఈ లక్షణాలు లేవని పేర్కొంది. తక్కువ ఆదాయాలు, తక్కువ ఆస్తులతో ఎక్కువగా అప్పులు చేస్తున్నారని సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో సంపాదనలో భారతీయ యువతనే మేటి అని సర్వే తేల్చింది.
Tags:    

Similar News