ఎమ్మెల్యే మనవరాలిపై బామ్మ కేసు...వైరల్

Update: 2020-08-28 01:30 GMT
మన దేశంలో అన్నదమ్ములు...అక్కచెల్లెళ్లు....తండ్రీకొడుకుల మధ్యం ఆస్తి గొడవలు, తగాదాలు జరగడం సర్వసాధారణం. చాలావరకు ఈ ఆస్తి తగాదాలను....వారిలో వారే పరిష్కరించుకోవడమో...పెద్ద మనుషుల మధ్య పంచాయతీనో...రాజకీయ నేతల మధ్యవర్తిత్వం వల్ల పరిష్కరించడమో జరుగుతుంది. ఇక, కొన్ని సార్లు ఈ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టులు వరకు వెళుతుంటాయి. అయితే, ఉత్తర ప్రదేశ్ లో ఆస్తి తగాదాల వ్యవహారంలో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాల పంచాయతీలు చేయాల్సిన ఎమ్మెల్యేపైనే ఆస్తి తగాదాల వ్యవమారంలో బెదిరింపు ఆరోఫణలు వచ్చాయి. తాజాగా ఆస్తి తగాదాల సెగ....ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎమ్మెల్యేకూ తగిలింది. రాయ్ ‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై ఆమె బామ్మ కమలా సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం మనుమరాలు అదితి సింగ్ తనను వేధిస్తోందంటూ ఆమె బామ్మ కమలాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కమలా సింగ్‌ ఫిర్యాదు ప్రకారం ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఎస్పీ స్వప్నిల్‌ మాంగేన్‌ వెల్లడించారు. ఫిర్యాదుదారు, ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. డిసెంబరు 30, 2019న తన ఇంట్లోకి అదితి, ఆమె బంధువులు వచ్చారని, ఆస్తి మొత్తం వారి పేరిట బదిలీ చేయాలని బెదిరించారని కమలా సింగ్ ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలపై అదితి సింగ్‌ ఇంకా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు వచ్చినా...ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అదితి...ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ స్పీకర్ ను కోరింంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లిన అదితి సింగ్‌ లో ఆ పార్టీ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయని, పెద్దల్ని గౌరవించాల్సిందిగా బీజేపీ చెప్పలేదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సరికాదని, కాంగ్రెస్‌ నైతిక విలువలను పూర్తిగా వదిలేసిందని బీజేపీ నేతలు బదులిచ్చారు.
Tags:    

Similar News