తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఒంటి కాలిపై లేసే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తాజాగా మహబూబ్ నగర్ లో పర్యటించిన సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. దీనిపై ఆ జిల్లా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి - గువ్వల బాలరాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అడ్రస్ లేని తెలుగుదేశం పార్టీని పైకి లేపేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని ఎద్దేవా చేశారు. అందుకే టీఆర్ ఎస్ పై రేవంత్ రెడ్డి పిచ్చి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎప్పుడో చీ కొట్టి కిలోమీటర్ల లోతులో బొంద పెట్టారని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని గమనించని రేవంత్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని, సీఎం అవుతానన్న కలల్లో బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ సీఎం కల నెరవేరాలంటే.. సొంతంగా సినిమా నిర్మించుకుని.. అందులో సీఎం పాత్ర వేసుకోవాల్సిందే తప్ప నిజజీవితంలో సాధ్యమయ్యే పని కాదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు నిందితుడిగా భావిస్తున్నారే కానీ ప్రజాప్రతినిధిగా ఎవరూ భావించడం లేదని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/