ఎవ‌రా కోవ‌ర్టులు.. నందీశ్వ‌ర్ బొమ్మాళీ!?

Update: 2023-06-08 08:00 GMT
జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రాలొస్తున్నాయ్‌.. భూమార్గం ప‌ట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను.. అని శ్రీశ్రీ అన్న‌ట్టుగా తెలంగాణ బీజేపీ లోనూ కొంద‌రు నాయ‌కులు "మా పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారు. వారి ని బ‌య‌ట‌ కు లాగుతాను. బ‌హిరంగ ప‌రుస్తాను" అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ వ‌రుస‌ లో  మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా ఇలాగే కామెంట్స్ చేయడం మరో 15 రోజుల్లో మీడియాకు ఆ కోవ‌ర్టుల పేర్లు బట్టబయలు చేస్తానని ప్రకటించడం పెను సంచలనమైంది. అంతేకాదు.. పేర్లు చెప్ప‌క‌పోయినా.. ఆయ‌న కోవ‌ర్టుల సంఖ్య నాలుగు అని వెల్ల‌డించారు.

అంటే.. తెలంగాణ బీజేపీ లో న‌లుగురు కోవ‌ర్టులు ఉన్నార‌న్న మాట‌. వీరు పార్టీ లోనే ఉంటూ పార్టీ  ఎదుగుద‌ల‌ ను తొక్కేస్తున్నా ర‌ని.. పార్టీ కార్య‌క‌లాపాల‌ ను వ్యూహాల‌ ను కూడా ఇత‌ర పార్టీల‌ కు చేర‌వేస్తూ..ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌న్న‌ది నందీశ్వ‌ర్ గౌడ్ వాద‌న‌ గా ఉంది. వాస్త‌వాని కి నందీశ్వ‌ర్ గౌడ్ కాంగ్రెస్ నాయ‌కుడు. ఆయ‌న రాజ‌కీయాలు ఈ పార్టీ తోనే ప్రారంభ‌మ‌య్యాయి. 2014లో ప‌ఠాన్‌ చెరువు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే గా విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. పార్టీ మారి బీజేపీ లో కొన‌సాగుతున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయ‌న తెర‌మీద‌క‌నిపించారు.

బీజేపీ లో కోవ‌ర్టులు ఉన్నార‌ని నందీశ్వ‌ర్ గౌడ్ చేసిన వ్యాఖ్య‌ల‌ తో బీజేపీ లో క‌ల‌క‌లం రేగుతుంద‌ ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఈయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసి నాలుగు రోజులు గ‌డిచినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ జ‌ర‌గ‌లేదు. ఇక‌, నందీశ్వ‌ర్ గౌడ్ ఆలోచ‌న‌ల ను బ‌ట్టి చూస్తే.. బీజేపీ లో చేరిన మాజీ బీఆర్ ఎస్ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి ప్ర‌ధాన కోవ‌ర్టు ల‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిపైనే రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి.. బీజేపీ లో చ‌క్రం తిప్పుతున్న వారికి ద‌క్కుతున్న ప్రాధాన్యం త‌న‌కు ల‌భించ‌డం లేద‌నేది నందీశ్వ‌ర్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

కొన్ని నెల‌ల కింద‌ట ఇదే ఆరోప‌ణ ఆయ‌న చేశారు. అప్ప‌ట్లో ఈ విమ‌ర్శ‌ల‌ ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఒక్క‌సారిగా నందీశ్వ‌ర్ ప్లేటు ఫిరాయించి.. కోవ‌ర్టులు అంటూ పెద్ద కామెంట్లే చేశారు. అంతేకాదు.. వారంత‌ట వారే.. పుట్ట‌లోంచి పాములు వ‌చ్చిన‌ట్టు బ‌య‌ట‌కు రావాల‌ ని ష‌ర‌తు పెట్ట‌డం.. లేక‌పోతే, తానే వెల్ల‌డిస్తాన‌ని చెప్ప‌డం కూడా విస్మ‌యాని కి గురిచేస్తోంది. వాస్త‌వానికి కోవ‌ర్టుల‌కు టైం ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేదు. వారు బ‌య‌ట‌కు ఎందుకు వ‌స్తారు?  సో.. ఏదైనా ఉంటే నందీశ్వ‌రే బ‌య‌ట పెట్టాల‌ ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక‌, ఇంత జ‌రుగుతున్నా.. అటు అధిష్టానం కానీ, ఇటు రాష్ట్ర నాయ‌క‌త్వం కానీ నందీశ్వ‌ర్ వ్యాఖ్య‌ల‌ పై స్పందించ‌ లేదు. ఆ కోవ‌ర్టులు ఎవ‌రు అనే విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. నిజాని కి ఇత‌ర పార్టీల నుంచి మ‌రింత మందిని చేర్చుకుని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారం లోకి తెచ్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పుడు కొంద‌రి పై కోవ‌ర్టులు అంటూ ముద్ర వేసే సాహ‌సం చేసే అవ‌కాశం లేదు. నందీశ్వ‌ర్ చెప్పిన దాని లో నిజం ఉన్నా.. లేక‌పోయినా.. అనుమానిస్తూ.. వ్య‌వ‌హ‌రిస్తే.. నాయ‌కులు పార్టీకి దూరం అవుతార‌నే ఆలోచ‌న ఇటు రాష్ట్ర నాయ‌క‌త్వం నుంచి కేంద్ర నాయ‌క‌త్వం వ‌ర‌కు వినిపిస్తోంది.

కాబ‌ట్టి.. నందీశ్వ‌ర్ చేసిన కోవ‌ర్టుల ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం కాలేక పోయింది. ఇదిలావుంటే, గౌడ్ త‌న వ్యూహాన్నిఅమ‌లు చేసే క్ర‌మం లో ఇలా బీజేపీ పై రాళ్లు వేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. అంటే.. ఆయ‌న త‌న సొంత గూటికి(కాంగ్రెస్‌) వెళ్లాల‌నే ఉద్దేశంతో  ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అయితే, త‌నంత‌ట‌త తానుగా కార‌ణం లేకుండా కాంగ్రెస్‌ లోకి జంప్ చేస్తే.. విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావించి.. ఏదో ఒక కార‌ణం చూపించాల‌నే ఉద్దేశం తోనే బీజేపీ పై ఇలా కోవ‌ర్టులు అంటూ కామెంట్లు చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏదేమైనా.. నందీశ్వ‌ర్ గౌడ్ ఏం  చేస్తారో... ఆయ‌న విధించిన 15 రోజుల గ‌డువు లోపు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News