మీకు చేతకాకుంటే ... సీపీ సజ్జనార్‌కు ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సవాల్ !

Update: 2021-01-07 12:57 GMT
సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సవాల్ విసిరారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే నేరుగా రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీచేశారు. ఆ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. బహుదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను రాజాసింగ్ బయట పెట్టారు.

మీకు చేతకాకుంటే అనే పదాన్ని నేను ఉపయోగించవచ్చు. కానీ పోలీస్ కమిషనర్ అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయండి. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదు.. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోండి.’ అంటూ నేరుగా సీపీ సజ్జనార్‌ కే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదని.. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజసింగ్ డిమాండ్ చేశారు.

అవుల ఆక్రమ రవాణాకు సంబంధించిన అంశంలోనే గతంలో సీపీ సజ్జనార్‌ పై రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే సీపీ సజ్జనార్ సైతం రాజాసింగ్ పై అంతే స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసరడం తో సీపీ సజ్జనార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News