హోలీ వేడుక‌లో `బీరు కొట్టుకున్నారు`.. ఎమ్మెల్యేనే రంగంలోకి!

Update: 2022-03-18 15:30 GMT
దేశ‌వ్యాప్తంగా హోలీ సంబ‌రాలు మిన్నంటాయి. క‌రోనా నేప‌థ్యంలో గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా .. ఈ పండుగ‌కు దేశం మొత్తం దూరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది.. ఒకింత క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. ఊరూ వాడా అంద‌రూ సంబ‌రాలు చేసుకున్నారు. ఇలానే.. తెలంగాణ‌లోనూ ప్ర‌తిప‌ల్లె, ప‌ట్నం.. సంబ‌రాల్లో మునిగిపోయింది.

అయితే.. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తూ.. ఈ వేడుక‌లో ఏకంగా.. బీరుతోనే హోలీ నిర్వ‌హించ‌డం వివాదానికి దానికి దారితీసింది. సాధార‌ణంగా.. హోలీ అంటే.. వివిధ ర‌కాల రంగులు చ‌ల్లు కోవ‌డం ఆన‌వాయితీ. లేదా.. రంగు క‌లిపిన నీటిని చ‌ల్లుకుంటారు. కానీ, తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా బీరు చ‌ల్లి హోలీకి ప్ర‌త్యేక‌త‌ను నింపేశారు.  

మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీరు బాటిళ్లతో హల్ చల్‌ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకల్లో భాగంగా బీర్ల వర్షం కురిపించారు.

మందు బాటిల్‌తో స్టెప్పులు వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తలకు స్వయంగా మందు బాటిల్‌ నోట్లో పెట్టి  మందు పోసి హంగామా సృష్టించారు. కార్యకర్తలు కూడా మద్యం కొట్టి ఎమ్మెల్యేతో సందడిగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలతో ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు మద్యంతో హల్‌చల్‌ చేయడం స్థానికులను విస్మయానికి గురి చేసింది.

మ‌రోవైపు.. కరీంనగర్‌లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా హోలీ వేడుకలకు దూరంగా ఉన్న జనం ఈసారి చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాలనీల్లో, ఇళ్లల్లో ఎక్కడా చూసినా రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు.  కరీంనగర్‌ గీతా భవన్‌ చైరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు హోలీ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పాల్గొన్నారు. హోళీ సంబరాలలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ అందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు.  డీజే పాటలకు స్టెప్పులు వేశారు.
Tags:    

Similar News