నిజం నాలుగు ఊళ్లు దాటేలోపే....అబద్దం అరవై ఊళ్లకు చేరుతుందన్న తరహాలో కొన్ని ఫేక్ వార్తలు ఈ మధ్య కాలంలో శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలకు సంబంధించిన రూమర్లు గంటల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా, అదే తరహాలో....ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - రాయ్ బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వదంతి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వారిద్దరి ఫొటోలను కలిపి ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు....అభినందనలు కూడా చెప్పేసుకుంటున్నారు. మరి కొందరైతే ఏకంగా రాహుల్ గాంధీకే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ వదంతిపై అదితి సింగ్(29) స్పందించారు. తనకు రాహుల్ రాఖీ కట్టిన అన్నయ్య అని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై ఇటువంటి పుకార్లు పుట్టించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు రాహుల్ గాంధీతో పెళ్లి జరగబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అదితి ఖండించారు. ఈ పుకార్లు వినగానే తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని ఆమె అన్నారు. ఇటువంటి అర్థంపర్థం లేని నిరాధార విషయాలను ప్రచారం చేయడం తనకు బాధ కలిగించిందని అదితి మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీని తన పెద్దన్నయ్యలా భావిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. తాను గతంలో రాహుల్ గాంధీకి రాఖీ కట్టానని, ఆయన తన సోదరుడితో సమానమని చెప్పారు. సోషల్ మీడియాలో తమ ఇద్దరిపై వస్తోన్న వ్యాఖ్యలు బాధించాయన్నారు. కాగా, అదితి సింగ్ తండ్రి అఖిలేష్ ....రాయ్ బరేలీ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణం అనంతరం అదితి...తండ్రి స్థానంలో రాజకీయాల్లోకి వచ్చారు. అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయంలో అదితి మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గత ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి 90 వేల ఓట్ల ఆధిక్యంతో అదితి గెలిచారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీకి అదితి అత్యంత సన్నిహితురాలని తెలుస్తోంది.