నిప్పుల్లో నడిచిన ఎమ్మెల్యే .. !

Update: 2019-12-28 11:35 GMT
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 23వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 27 వరకు ఘనంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న ఆలయం వద్ద పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే , ఆ తరువాత అందరితో పాటుగా నిప్పులపై నడిచారు. దేవుడి పై గల భక్తే తమను నిప్పులపై నడిచేలా చేసిందని తెలిపారు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. జిల్లా అభివృద్ధి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ అయ్యప్పను వేడుకున్నట్లుగా తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన మానుకోట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసముద్రంలో ఓ వేదికపై శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మూడు రకాల బలుపులుంటాయని.. అందులో వెలమ, రెడ్ల బలుపు ఒకటంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. తర్వాత ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన భావం వేరు.. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలి. కావాలనే కొందరు నా వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారు అని తెలిపారు.
Tags:    

Similar News