కోమ‌టిరెడ్డి 139 స్విఫ్ట్ కార్లు ఇచ్చి గెలిచారా..!

Update: 2015-12-31 09:25 GMT
ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం.. అయితే ఇన్నాళ్లూ గెలుస్తూ ఉన్న పార్టీకి ఒక‌సారి ప‌రాభ‌వం ఎదురైతే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. ఇక త‌మ పార్టీ అభ్య‌ర్థిపై గెలిచిన అభ్య‌ర్థిపై విమ‌ర్శ‌లు - ఆరోప‌ణ‌లు చేసేస్తూ ఉంటారు. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అన్నిచోట్లా భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగిన 12 స్థానాల్లో 10 కైవ‌సం చేసుకుంది. ఇందులో ఆరు ఏక‌గ్రీవం కాగా మ‌రో నాలుగింటిలో గెలిచింది. మిగిలిన రెండు స్థానాల‌ను కాంగ్రెస్ ద‌క్కించుకుంది. కాంగ్రెస్ న‌ల్గొండ‌తో పాటు మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో కూడా గెలిచినా ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు న‌ల్గొండ‌లో కాంగ్రెస్ ఘ‌న‌విజ‌యం గురించే చ‌ర్చించుకుంటున్నారు.

ఉత్కంఠ భ‌రితంగా సాగిన న‌ల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కోమ‌టిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కోమ‌టిరెడ్డి ఒక్కొక్క‌ ఓట‌రుకు స్విఫ్ట్ కారు గిఫ్టుగా ఇచ్చినందువల్లే గెలిచార‌ని విమ‌ర్శించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి కోమటిరెడ్డి 139 స్విఫ్ట్ కార్లు ఓటర్లకు ఇచ్చారని, మహిళ ఎంపీటీసీలు - జ‌డ్పీటీసీల‌కు పది తులాల చొప్పున బంగారు గొలుసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ ఎస్ 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పది చోట్ల గెలిస్తే ఆ విజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు  కాంగ్రెస్ ప్ర‌యత్నిస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు.
 
కాంగ్రెస్ కేవ‌లం రెండు సీట్లు గెలిచి విర్రవీగుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. తాము మూడు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామ‌ని ముందుగానే ప్ర‌తిపాదించినా కాంగ్రెస్ ఒప్పుకోలేద‌ని..తీరా ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఆ పార్టీ రెండు స్థానాలే గెలుచుకుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇక న‌ల్గొండ జిల్లాలో అధికార పార్టీ అభ్య‌ర్థి ఓడిపోయినా మంత్రి జ‌గ‌దీష్‌ రెడ్డి ప‌ద‌వికి ఇబ్బంది వ‌స్తుంద‌ని వ‌స్తున్న వ‌దంతుల్లో నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇదిలా ఉంటే  ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌ రెడ్డి ఆరోప‌ణ‌ల‌ను కాంగ్రెస్ నాయ‌కులు ఖండిస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోవ‌డంతో అధికార పార్టీ నాయ‌కులు కుంటిసాకులు వెదుకుతున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. రాజేశ్వరరెడ్డి చేసిన ఆరోపణను రుజువు చేస్తే కోమటిరెడ్డి తో తాము రాజీనామా చేయిస్తామని సవాల్ చేశారు.
Tags:    

Similar News