తొలిసారి భూమిమీదకు గ్రహశకలాలు.. ఖగోళపరిశోధనలో ఇదో అద్భుతం..!

Update: 2020-12-17 05:31 GMT
ఖగోళశాస్త్ర చరిత్రలో మరో ఆద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకల నమూనాలు భూమిమీదకు చేరుకున్నాయి. అయితే వీటి ఆధారంగా పరిశోధనలు సాగితే.. భూమికి సంబంధించిన అనేక రహస్యాలు, అంతరీక్షానికి సంబంధించిన అనేక నిగూఢమైన విషయాలు తెలిసే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ర్యుగు అనే గ్రహశకలంపైకి ఆరేళ్ల క్రితం హయబుసా2 అనే వ్యోమనౌకను పంపించారు. అయితే ఈ వ్యోమనూక సుదీర్ఘ ప్రమాణం చేపట్టింది. అంటే దాదాపు 30 కోట్ల కిలోమీటర్ల దూరంగా ప్రయాణించి గ్రహశకలానికి సంబంధించిన నమూనాలను సేకరించింది.

 గతేడాది తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఇప్పుడు భూమిమీదకు చేరుకున్నది. ఈ వ్యోమనౌకకు చెందిన క్యాప్సూల్ తాజాగా దక్షిణ ఆస్ట్రేలియాలోని వూమెరా ప్రాంతంలో  ల్యాండ్​ అయ్యింది. జపాన్ అంత‌రిక్ష సంస్థ (జాక్సా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. క్యాప్సూల్‌ సేఫ్‌గా భూమిని చేరింది. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చేపట్టి దానిని స్వాధీనం చేసుకున్నారు.

సౌరవ్యవస్థ ఆవిర్భావం, భూమిపై జీవం పుట్టుక మూలాలను తెలుసుకునేందుకు ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగ పడతాయనిశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యోమనౌక గ్రహశకలానికి చెందిన ఇసుక, మృత్తికలు, గ్యాస్​ తీసుకొచ్చింది. గ్రహశకలాలు కూడా సూర్యుడి చట్టు పరిభ్రమిస్తుంటాయి.  దీని ఆధారంగా సౌరవ్యవస్థలో ఇంతకాలం నిగూఢంగా ఉన్న అనేక విషయాలపై క్లారిటీ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tags:    

Similar News