మోడీ 65 గంటలు.. 60 ఫోటో షూట్లు.. ఇదేనా యూరోప్ టూర్?

Update: 2022-05-08 06:09 GMT
ప్రధాని నరేంద్ర మోడీ యూరోప్ టూర్ మీద ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పన్ ఖేరా. ఆయన టూర్ ను మూడు ముక్కల్లో ఎఫెక్టివ్ గా తేల్చేశారు. తాజా యూరోప్ టూర్ లో మూడు దేశాల్లో 65 గంటలు జరిగిన టూర్ లో 60 ఫోటో షూట్లతో హడావుడి చేశారన్నారు. ‘‘65 గంటలు 60 ఫోటో షూట్లతో హడావుడి చేసిన మోడీ సాబ్.. ఎల్ పీజీ ధరల బహుమతితో దేశానికి తిరిగి వచ్చారు’’ అంటూ మండిపడ్డారు.

తాజాగా పెంచిన రూ.50 ధరతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగటంతో పాటు.. పెను భారంగా మారాయని ఆయన మండిపడ్డారు. సబ్సిడీని వదులుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రజలకు చెప్పిందని.. 2015-16లో రూ.18 కోట్లకు 2017లో సున్నాకు తగ్గించారన్నారు. ప్రజలపై ప్రతి రోజూ భారం మోపుతున్నారని విరుచుకుపడ్డారు.

ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అధిక ధరల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ కు సబ్సిడీని ఇచ్చిందన్న పవన్ ఖేరా.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. తరచూ గ్యాస్.. పెట్రో ధరల్ని పెంచుతూ ప్రజలపై మోడీ సర్కార్ ధరల భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. పేద.. మధ్యతరగతి ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటే.. మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వారి నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.
Tags:    

Similar News