ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైరి వర్గాలపై తనదైన శైలిలో దాడి చేయడంలో దిట్టగానే చెప్పాలి. వైరి వర్గంలో కాకలు తీరిన నేతలున్నా... మోదీ ఎంట్రీ ఇచ్చారంటే చిత్తు కావాల్సిందే. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే వైరి వర్గాలను తుత్తునీయలు చేయడంలో తనదైన నేర్పును సాధించిన మోదీ... ప్రధాని అయ్యాక దానికి మరింతగా పదును పెట్టారనే చెప్పాలి. సమయానుకూలంగా - సందర్భానుసారంగా మోదీ చేసే సెటైర్లు బాగా పేలుతున్నాయి. అసలు సెటైరిక్ విమర్శలకు మోదీ పెట్టింది పేరుగా కూడా ఇప్పుడు చెప్పుకోవాలి. ప్రత్యర్థిని పొగడుతూనే... తెగడటంలో మోదీని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయాన్ని తన గుంటూరు టూర్ లోనే మోదీ మరోమారు నిరూపించుకున్నారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం నేపథ్యంలో ఓ వైపు రాష్ట్రమంతా నిరసనలతో అట్టుడుకుతున్నా... గుంటూరు సభలో మోదీ చేసిన సెటైరిక్ ప్రసంగం జనం దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడునే లక్ష్యంగా చేసుకుని సెటైర్లు సంధించిన మోదీ.... చంద్రబాబు దేశ రాజకీయాల్లో సీనియర్ నేతనే అంటూ... ఆ సీనియారిటీ తనకు లేదని, చంద్రబాబే సీనియర్ అని చెబుతూ... ఏఏ విషయాల్లో చంద్రబాబు సీనియర్ అన్న విషయాన్ని చెబుతూ మోదీ తనదైన శైలి ప్రసంగంతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. దేశ రాజకీయాల్లో తానే సీనియర్ ను అని, ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా తానే సీనియర్‌ను అని చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇవే మాటలను పదే పదే వల్లె వేసిన మోదీ... చంద్రబాబుపై సెటైరిక్ దాడి చేశారు. ఈ దాడితో చంద్రబాబు వైఖరిని మోదీ తూర్పారబట్టారని చెప్పాలి.
అయినా చంద్రబాబు సీనియారిటీపై మోదీ చేసిన సెటైరిక్ విమర్శలు ఎలా సాగాయన్న విషయానికి వస్తే.... సొంత మామను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియరే. ఆ విషయంలో నేను ఏమాత్రం చంద్రబాబుకు సరి తూగలేను. మిత్రపక్షాలను మార్చడంలో, పార్టీల ఫిరాయింపులులో, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మాత్రమే చంద్రబాబు సీనియర్. ఈ రోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి, రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్. ఎన్టీఆర్ కుర్చీని అందుకున్న వ్యక్తి(చంద్రబాబు)... ఆయన కలలను నిజం చేస్తానని చెప్పాడా? లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా? లేదా? కానీ ఈరోజు ఎన్టీఆర్ మాటలకు గౌరవం ఇస్తున్నారా? ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లకు ఎందుకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పంచన వెళ్లి కూర్చోవాల్సినంత ఇబ్బంది చంద్రబాబుకు ఏమొచ్చింది? పార్టీ సిద్ధాంతాలను వదిలేయాల్సినంత ఒత్తిడి ఏమి వచ్చింది? కాంగ్రెస్ అణచివేత, అహంకారం నచ్చకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి, కాంగ్రెస్ ముక్త ఏపీని చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు* అని మోదీ తనదైన స్టైల్లో సెటైరిక్ దాడి చేశారు.