ఏపీ సర్కార్ తో వివాదం పెట్టుకొని రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ ఎయిమ్స్ మొత్తాన్ని కోవిడ్ రోగుల కోసం వాడేసింది. కానీ కోవిడ్ రోగులను కాదని ఎంపీ రఘురామ ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం విశేషంగా మారింది. కేంద్రం పెద్దల జోక్యం చేసుకొని మరీ వైసీపీ ఎంపీ రఘురామకు ఎయిమ్స్ లో ప్రత్యేక వార్డు కేటాయించారట..
ఏపీ పోలీసుల విచారణ తర్వాత ఎంపీ రఘురామ కాళ్లకు గాయాలు కనిపించాయి. పోలీసులు దాడి చేశారని ఎంపీ రఘురామ ఆరోపించగా.. పోలీసులు మాత్రం అవి రఘురామకు వ్యాధి వల్ల వచ్చిన వాపులని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు రఘురామ షిఫ్ట్ అయ్యారు.
కాగా రఘురామకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకొందరు బీజేపీ ముఖ్యులుకూడా ఆయనను పరామర్శించినట్లు సమాచారం.
నిజానికి ఎంపీ రఘురామ ఎయిమ్స్ లో చేరడానికి ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఆ ఆస్పత్రి ప్రస్తుతం కోవిడ్ రోగులతో నిండిపోయింది. ప్రత్యేక వార్డు సదుపాయం కల్పించేందుకు ఆలస్యమైంది. దీంతో కేంద్రఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఎంపీ రఘురామ కోసం ఏకంగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు ఫోన్ చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిసింది. గురువారం ఉదయానికి స్పెషల్ వార్డు సిద్ధమైన తర్వాత స్వయంగా గులేరియా ఎంపీ రఘురామకు ఫోన్ చేసి ఎయిమ్స్ కు రావాల్సిందిగా కోరినట్లు సమాచారం.
ఈరోజు ఎయిమ్స్ కు వచ్చిన ఎంపీ రఘురామ మీడియా చుట్టుముట్టగా మాట్లాడేందుకు నిరాకరించారు. సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా ఇచ్చిన ఆదేశానుసారం మీడియా, సోషల్ మీడియాకు ఎంపీ రఘురామ దూరంగా ఉన్నారు.మొత్తం ఎంపీ రఘురామ కోసం మోడీ సర్కార్ ఏకంగా ఎయిమ్స్ లో సపరేట్ బెడ్ అరేంజ్ చేయడం చూస్తుంటే రఘురామ పై మోడీ, కేంద్రమంత్రులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. సపోర్టు చేస్తున్నారో అర్థమవుతోందంటున్నారు.