తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు..కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. అల్లూరి తరం వారిని ఆయన ఘనంగా సత్కరించారు.
అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకో వడం నా అదృష్టం. దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకుంటోంది. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. ఇలాంటి సమయంలో.. మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవా లు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
అంతేకాదు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మాతృభా షలో విద్య కోసం 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయన్నారు.
అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలని.. చెప్పారు. అల్లూరి 125వ జయంతి సందర్భంలో వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అయితే.. ఈ సందర్భంగా.. అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించిన ప్రధాని.. కేవలం వారికి ఒక శాలువా కప్పి.. నమస్కారం పెట్టడంతోసరిపుచ్చడంపై.. విస్మయం వ్యక్తమవుతోంది. ఆదివాసీలకు ఎంతో చేశామని.. చెబుతున్న మోడీ.. ఇప్పటికీ.. అనేక గిరిజన నియోజకవర్గాల్లో విద్య, వైద్య సౌకర్యాలు లేని విషయాన్ని మరిచిపోయారని.. పరిశీలకులు. ముఖ్యంగా అల్లూరి కుటుంబం ఇప్పటికీ.. పూరి పాకల్లోనూ..అ ద్దె ఇళ్లలోనూ నివసిస్తోంది. మరి వారిని ఆదుకునేందుకు.. ఆర్థికంగా ఒక ప్యాకేజీ ప్రకటించి ఉండాల్సింది.
కానీ, ప్రధాని మోడీ.. ఈ విషయాన్ని పక్కన పెట్టి.. కేవలం.. వారిని సత్కరించి.. శాలువా ఇవ్వడంతోనే సరిపుచ్చారు. మరి దీనివల్ల అల్లూరి కుటుంబానికి.. ఏం ఒరిగింది.. నాలుగు మాటలు రెండు శాలువాలేనా? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ.. కేంద్ర ప్రభుత్వం కానీ..ఏం సమాధానం చెబుతాయనేది పరిశీలకులు ప్రశ్న.