విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ చేయబోతున్నారు. ఆయన రెండు రోజుల పాటు విశాఖలో గడపబోతున్నారు. దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు విలువ చేసే అనేక కార్యక్రమాలకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఒక విధంగా ప్రతిష్టాత్మకమైన టూర్ ఇది. మరి ఇంతటి టూర్ లో బీజేపీ జెండాలే విశాఖ వీధుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి తప్ప జనసేన జెండా ఏదీ లేదేంటి అన్నదే చర్చగా ఉంది.
నిజానికి చూస్తే జనసేన బీజేపీకి అధికారిక మిత్రపక్షంగా ఉంది. మూడేళ్ళ క్రితం మిత్రబంధం కుదిరింది. కానీ చాలా కాలంగా ఎడముఖం పెడముఖంగానే కధ సాగుతోంది. మరో వైపు చూస్తే టీడీపీ జెండాలతో జనసేన జెండాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈ మధ్యన చంద్రబాబు పవన్ విజయవాడలో ఒక హొటల్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో అటు పొత్తు పొడుస్తోంది.
దాంతో బీజేపీ కూడా పవన్ విషయంలో మిత్రుడు అన్నది పక్కన పెట్టేసినట్లుగానే ఉంది అంటున్నారు. దీని మీద విశాఖ మీడియా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుని ప్రశ్నించినపుడు ఆయన తెలివిగా ప్రధాని టూర్ అంతా అఫీషియల్ అని చెప్పారు. అంతే కాదు ఎవరిని పిలవాలి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాలి అన్నది ఏకంగా ప్రధాని ఆఫీస్ మాత్రమే చూస్తుంది అని చెప్పారు.
అంటే తమ చేతుల్లో ఏమీ లేదని చెబుతూ పవన్ కి ఇన్విటేషన్ విషయంలో చక్కా చేతులు దులుపుకున్నారని అంటున్నారు. మరి విశాఖలో ప్రధాని టూర్ ని సక్సెస్ చేయడానికి బీజేపీ అన్ని రకాలుగా చూస్తోంది. భారీ ఎత్తున రోడ్ షో కూడా చేయాలనుకుంటోంది. మరి దానికి జనాలు కావాలంటే పక్కన మిత్రుడు జనసేన ఉంటే ఎంతో బాగుండేది.
విశాఖలో జనసేనకు గట్టి పట్టుంది. విశాఖ ఎంపీ సీటుతో పాటు గాజువాకలో కూడా గత ఎన్నికల్లో బాగానే ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. దాంతో జనసేనను కూడా కలుపుకుని ఉంటే ధాం ధూం గా ప్రధాని రోడ్ షో సాగేది అన్న వారూ ఉన్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం తాము ఒక్కరే అన్నట్లుగా అన్నీ చేసుకుని పోతున్నారు. మరో వైపు చూస్తే జనసేన నాయకులు మాత్రం ప్రధాని టూర్ తమకు పట్టనట్లుగానే ఉన్నారు.
బీజేపీ నుంచి తగిన ఆహ్వానం తమ నాయకుడి లేనందువల్ల తాము కూడా అలాగే దూరంగా ఉండిపోతున్నారు. మరి ప్రధాని 11న సాయంత్రం విశాఖ వస్తున్నారు. ఆయన రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఏపీ రాజకీయాలను కూడా ప్రధాని ఆరా తీసే అవకాశం ఉంది. మరి ఆ టైం లో మిత్రుడు జనసేన పొత్తు ప్రస్తావన కూడా వచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ప్రధాని అన్ని పరిస్థితులను చూసి చివరి నిమిషంలో అయినా జనసేనకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం చూస్తే జనసేన సహా ఏ పార్టీ నేతలు ప్రధాని నుంచి అపాయింట్మెంట్ లేదనే అంటున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ జనసేనల పొత్తు వ్యవహారం తేల్చేలా మోడీ టూర్ ఉంటుందని అంటున్నారు. మోడీ ప్రధాని హోదాలో సభలో పాల్గొని యధావిధిగా వెళ్ళిపోతే మాత్రం జనసేనను లైట్ తీసుకున్నట్లే అంటున్నారు. ఆ మీదట జనసేన బీజేపీ పొత్తులకు స్వస్తివాచకం పలకడం ఎంతో దూరంలో ఉండదని అంటున్నారు. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ప్రధాని టూర్ లో జనసేన కనిపించే చాన్స్ అయితే ఇప్పటికి లేదు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.