మన్మోహన్ కంటే మోడీ ఒకటి ఎక్కువే బాస్

Update: 2016-07-06 04:49 GMT
మంత్రివర్గ విస్తరణను తాను అనుకున్నట్లే పూర్తి చేసిన ప్రధాని మోడీ నిర్ణయమా అని వేటు పడిన వారిని వదిలేసి.. కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చిన వారిని కలుపుకుంటే మొత్తం మంత్రివర్గం సంఖ్య 78కి చేరుకున్నట్లైంది. తాజాగా జరిగిన విస్తరణతో మోడీ క్యాబినెట్ జంబో క్యాబినెట్ అన్న ట్యాగ్ ను దక్కించుకున్నట్లైంది. నిబంధనల ప్రకారం.. కేంత్రమంత్రివర్గంలో 82 మందిని చేర్చుకునే అవకాశం ఉంది. తాజాగా జరిగిన పునర్ వ్యవస్థీకరణతో మన్మోహన్ సర్కారు కంటే పెద్దదైన మంత్రివర్గంగా మోడీ క్యాబినెట్ మారింది.

మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో 77 మంది మంత్రులు ఉండేవారు. తాజాగా జరిగిన మార్పుతో అంతకంటే ఒకరు ఎక్కువగా 78 మంత్రుల బృందం మోడీ టీంగా మారింది. ఇక.. తాజాగా మంత్రివర్గ విస్తరణలో కొత్తగా వచ్చిన మంత్రుల ఏజ్ గ్రూప్ ను చూస్తే.. యాభై ఏళ్ల లోపు వారు ఐదుగురు కాగా.. పది మంది అరవైఏళ్లను క్రాస్ చేసిన వారే. ఇక.. అనుప్రియ పటేల్ వయసు మాత్రం అందరి కంటే తక్కువగా చెప్పాలి. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు మాత్రమే.  
Tags:    

Similar News