తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల ఇదే కారణంతో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతితో నామినేట్ చేయించింది. అలాగే ప్రముఖ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో ప్రముఖ హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు.
అలాగే ప్రధాని మోడీ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు భీమవరం వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కొద్ది నిమిషాలు మంతనాలాడారు. ఇటీవల ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా చిరంజీవిని ఎంపిక చేసినప్పుడు ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, గవర్నర్లు సైతం అభినందనలు తెలిపారు.
ఇప్పుడు మరోమారు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజులపాటు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 2023లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక, తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ చర్చించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వర్గీయ ఎన్టీ రామారావును గుర్తు చేసుకున్నారు. అట్టడుగు స్థాయిలో పోరాడి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. నిత్యం ప్రజల పక్షాన నిలిచే నాయకుడు ఎన్టీఆర్ అని, రాజకీయంగా ఎదగాలని కోరుకునే వారికి ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈ ఏడాది చివరలోనే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ను కొనియాడటం ద్వారా బడుగు, బలహీనవర్గాల్లో, కమ్మ సామాజికవర్గంలో ఆయనకున్న అభిమానులను బీజేపీ వైపు ఆకర్షించొచ్చని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపులను బాగా దువ్వుతోంది. రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు ఇద్దరూ కాపులే కావడం గమనార్హం. ఇప్పుడు మరో ప్రధాన సామాజికవర్గమైన కమ్మలపైనా బీజేపీ దృష్టి సారించిందని.. ఇందులో భాగంగానే మోడీ.. ఎన్టీఆర్ ను కొనియాడుతున్నారని అంటున్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ పై బీసీ సంఘాలకు ఓ అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని సెటిలర్లు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఓడిపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఈసారి ఇలాంటి వారందరినీ ఆకట్టుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావించారని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.