ముందస్తుకు వెళ్లటం ద్వారా ప్రయోజనం పొందాలని.. మరో ఐదేళ్లు పాలించేందుకు వీలుగా ప్రజామోదాన్ని పొందాలని ప్రధాని మోడీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే జమిలి ఎన్నికల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని సేకరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ముందస్తు ఎన్నికల ప్రచారానికి అందరి కంటే ముందుగా ప్రచారాన్ని స్టార్ట్ చేయాలని మోడీ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
ఆ మాటకు వస్తే.. గుట్టు చప్పుడు కాకుండా తన ఎన్నికల ప్రచారాన్నిఆయన ఇప్పటికే స్టార్ట్ చేశారన్న మాటను పార్టీ వర్గాలు చెబుతున్నారు. జమిలి ఎన్నికలతో అత్యధిక ప్రయోజనం పొందాలని భావిస్తున్న మోడీ.. ఒకవేళ ఆ విషయంలో తేడా వచ్చినా ఈ ఏడాది చివరి నాటికి సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పక్కా ప్రణాళికను పార్టీ వ్యూహకర్తలు సిద్ధం చేశారట. 2014 నాటి మోడీ ప్రభంజనాన్ని మళ్లీ రిపీట్ చేయటమే లక్ష్యమని చెబుతున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు రాకుండా షెడ్యూల్ కే ఎన్నికలు జరిగినా.. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా మోడీ ఎన్నికల ప్రచారానికి వ్యూహం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా మోడీ 100 లోక్ సభ నియోజకవర్గాల్ని కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో 50 నియోజకవర్గాల్లో ర్యాలీల్లో ప్రసంగిస్తారని చెబుతున్నారు. మోడీతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ సా.. సీనియర్ బీజేపీ నేతలు రాజ్ నాథ్ సింగ్.. నితిన్ గడ్కరీలు ఒక్కొక్కరు 50 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
మోడీ కవర్ చేసే ఒక్కో ర్యాలీ రెండు నుంచి మూడు లోక్ సభ నియోజకవర్గాల్ని కవర్ చేసేలా ఉంటాయిన చెబుతున్నారు. అదే జరిగితే.. మొత్తం 100కు 300 నియోజకవర్గాలు కవర్ కానున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటానికి ముందే 300 నుంచి 400 నియోజకవర్గాల్ని మోడీ కవర్ చేయాలన్నది లక్ష్యంగా చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేలా మోడీ ప్రచార సభలు ఉంటాయని తెలుస్తోంది. ఈ తరహా ర్యాలీని ఇప్పటికే మోడీ మొదలు పెట్టారని.. ఇందుకు నిదర్శనంగా పంజాబ్ లోని మలౌట్ ప్రాంతంలో మోడీ నిర్వహించిన ర్యాలీని చూపిస్తున్నారు. మోడీ ప్లాన్ చేసుకున్న భారీ ప్రచారంలో మలౌట్ మొదటిదని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన మోడీ ప్రచార వ్యూహం ఏ మేరకు సఫలవుతుందో చూడాలి.