మోడీ రేంటింగ్.. డౌన్! 66 శాతం నుంచి 24 శాతానికి!

Update: 2021-08-17 12:57 GMT
రెండో సారి ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌రేంద్ మోడీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ‌ను న‌మ్ముకునే బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల‌కు ముందుకు మోడీని ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్పుడు.. భారీ ఎత్తున ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌నే వాద‌న వినిపించింది. ఇదే ఆ ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారానికి చేరువ చేసింది. ఆ త‌ర్వాత‌.. 2019లో నూ ఇదే కొన‌సాగింది. ప‌లితంగా బీజేపీ చ‌రిత్ర‌లోనే తొలిసారి వ‌రుస‌గా కేంద్రంలో పాగా వేసే అవ‌కాశం ద‌క్కింది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఒక‌ప్పుడు జేజేలు ప‌లికిన ప్ర‌జ‌లే ఇప్పుడు మోడీకి `నై నై` అంటున్నారు.

ఉత్త‌మ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రు అంటే.. ఒక‌ప్పుడు.. మోడీ విష‌యంలో 66 శాతం మంది ప్ర‌జ‌లు జైకొట్ట‌గా.. ఇప్పుడు ఆ సంఖ్య 24 కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇది నిజంగా.. అంత తేలిక విష‌యం ఎంత మాత్రం కాదు. చాలా సీరియ‌స్ విష‌య‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ముఖ ప‌త్రిక ఇండియా టుడే సంస్థ‌.. `మూడ్ ఆఫ్ ది నేష‌న్‌` పేరిట ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ప్ర‌ధాన మంత్రి మోడీకి మార్కులు భారీ ఎత్తున త‌గ్గిపోయి.. గ్రాఫ్ కుదేల‌వ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌రోనాను స‌రైన విధంగా మోడీ హ్యాండిల్ చేయ‌లేక‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా క‌రోనా సెకండ్ వేవ్ విష‌యంలో కేంద్రం అనుస‌రించిన వైఖ‌రి.. మోడీ గ్రాఫ్‌ను దిగ‌జారేలా చేసింద‌ని అంటున్నారు. నిజానికి గ‌త ఏడాది నిర్వ‌హించిన స‌ర్వేలో మోడీకి త‌దుప‌రి ప్ర‌దానిగా 66 శాతం మంది జైకొట్టారు.కానీ, ఈ సంఖ్య ఒక్క‌సారిగా ఇప్పుడు 24 శాతానికి ప‌డిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌రోనా కార‌ణంగా తెలెత్తిన ఆర్థిక ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను అప్పుల పాలుచేసే వ్యూహాలు తీసుకురావ‌డ‌మేన‌ని అంటున్నారు. ఇక‌, ప్ర‌ధాన మంత్రిగా ఉత్త‌మ‌మైన వారి రేసులో త‌దుప‌రి పేరు యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌కు ప్ర‌జ‌లు జై కొట్టారు.

11 శాతం మంది ప్ర‌జ‌లు యోగిని త‌దుప‌రి ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌, గాంధీల వార‌సుడు.. రాహుల్ గాంధీ ఈ రేసులో మూడో స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న‌కు 10 శాతం మంది ప్ర‌జ‌లు జై కొట్టారు. అయితే.. ఈ ఇద్ద‌రూ కూడా పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది వీరికి వ‌రుస‌గా 3 శాతం, 8 శాతం మంది ప్ర‌జ‌లు జైకొట్ట‌గా.. ఇప్పుడు వీరి సంఖ్య పెరిగింది.

ఇక‌, ముఖ్య‌మంత్రుల విష‌యానికి వ‌స్తే.. ఆదిత్య‌నాథ్‌.. త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఏడో స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ 42 శాతం మంది ప్ర‌జాద‌ర‌ణ‌తో లీడ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఒడిశా సీఎం న‌వీన్‌, కేర‌ళ సీఎం విజ‌య‌న్‌, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, బెంగాల్ సార‌థి మ‌మ‌తా బెన‌ర్జీ, అసో సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌లు కూడా మంచి లీడ్‌లోనే ఉన్నారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు సంబంధించి యోగి, శ‌ర్మ‌లు మాత్ర‌మే తొలి 10 స్థానాల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. యూపీ సీఎం యోగికి 29 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే మంచి మార్కులు వేయ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

దేశ పాల‌కులు భ‌విష్య‌త్‌పై ఇండియా టుడే ప్ర‌చురించిన ముఖ చిత్రం క‌థ‌నం అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా మారింది. దేశంల నిరుద్యోగం పెరుగుతున్న తీరును ప్ర‌జ‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఎక్కువ మంది ప్ర‌జ‌లు.. ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. వీరి సంఖ్య 32 శాతానికి పెరిగింది. మోడీ హ‌యాంలో ఆర్థిక వృద్ధి పెరిగింద‌ని 28 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే పేర్కొన్నారు.




Tags:    

Similar News