క్యాబినెట్ విస్త‌ర‌ణ దిశ‌గా మోడీ అడుగులు

Update: 2017-04-07 04:28 GMT
త‌న జ‌ట్టును విస్త‌రించాల‌ని.. కొన్ని మార్పులు చేర్పులు చేయాల‌ని ప్ర‌ధాని మోడీ భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న అభిప్రాయానికి సంఘ్ సైతం ఓకే చెప్ప‌టంతో పాటు.. కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణపై కొంత‌కాలంగా చ‌ర్చ జ‌రుగుతున్నా.. అదెప్పుడు షురూ అవుతుంద‌న్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేని సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ క‌న్ఫ్యూజ‌న్‌కు తెర ప‌డింద‌ని చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల 27న క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప‌క్కా అన్న మాట‌ను చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో గోవా ముఖ్య‌మంత్రిగా మ‌నోహ‌ర్ పారీక‌ర్ అవ‌స‌రం ఏర్ప‌డ‌టంతో ఆయ‌న్ను.. ర‌క్ష‌ణ మంత్రిగా బాధ్య‌త‌లు తొల‌గించి.. గోవాకు పంప‌టం తెలిసిందే. దీంతో.. ఆ శాఖ బాధ్య‌త‌ల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో మ‌రో కీల‌క శాఖ‌కు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సుష్మా స్వ‌రాజ్ ఆరోగ్యం స‌రిగా లేని నేప‌థ్యంలో.. ఆమెకు కొంత ఒత్తిడి త‌గ్గించి విశ్రాంతిని ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రికొద్ది నెల‌ల్లో రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. ఆ ఎన్నిక‌కు సంబంధించిన కొన్ని అంశాల‌కు త‌గ్గ‌ట్లుగా క్యాబినెట్‌లో మార్పులు త‌ప్ప‌నిస‌రి అని.. అందుకే విస్త‌ర‌ణ‌ను ఈ నెలాఖ‌రు లోపు పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌ధాని ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. ఈ అంశంపై ఇప్ప‌టికే సంఘ్‌నేత‌ల‌తో  ప్ర‌ధాని చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా స‌మాచారం. విస్త‌ర‌ణ‌లో భాగంగా సంఘ్ పెద్ద‌లు కొన్ని మార్పుల్ని సూచించిన‌ట్లుగా తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ఆర్థిక మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న అరుణ్ జైట్లీకి ర‌క్ష‌ణ శాఖను అప్ప‌గిస్తార‌ని చెబుతున్నారు. ఇక‌.. ఆర్థిక శాఖ‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయిల్‌కు అప్ప‌గించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల కిడ్నీ ఆప‌రేష‌న్ జ‌రిగిన సుష్మ‌ను విదేశాంగ మంత్రిగా బాధ్య‌త‌లు త‌ప్పించి.. ఆమెను త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా పంపాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ అదేజ‌రిగితే.. ప్ర‌స్తుతం చిన్న‌మ్మ శ‌శిక‌ళ అడ్డాలోకి ఉత్త‌రాది చిన్న‌మ్మ వెళుతున్న‌ట్లు అవుతుంది.

ఇక‌.. విదేశాంగ బాధ్య‌త‌ల్ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజెకు అప్ప‌గించాల‌ని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని బీజేపీ సీనియ‌ర్ నేత ఓఎం మాథూర్‌ను ఎంపిక చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. కేంద్ర‌మంత్రివ‌ర్గంలో మ‌రో మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్న మిత్ర‌ప‌క్షం శివ‌సేన‌కు చెందిన నేత‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో శివ‌సేన ఓట్లు అవ‌స‌ర‌మైన ద‌రిమిలా.. వారిని సంతృప్తి ప‌ర్చేందుకు వీలుగా ఒక మంత్రి ప‌ద‌విని అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో మ‌రో మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేత‌కు మోడీ జ‌ట్టులో స్థానం ల‌భించ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇక‌.. తీసివేత‌ల విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రుసీనియ‌ర్ మంత్రుల వ‌ద్ద‌నున్న రెండు.. మూడు శాఖ‌ల్ని.. యువ ఎంపీల‌కు కొత్త‌గా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News