ఇది నిజ‌మేనా? సీఎం కోసం.. సీటు ఖాళీ పెట్టారా?

Update: 2022-07-27 15:17 GMT
తాజాగా ఒక‌సంచ‌ల‌న విష‌యం వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తోంది. రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము ఎన్ని క ముగిసి.. ఆమె ప్ర‌మాణ స్వీకారం కూడా పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో దేశంలోని బీజేపీ అనుకూల నాయ‌కులు అంద‌రూ హాజ‌ర‌య్యారు. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. సోనియా గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే వంటివారు హాజ‌ర‌య్యారు.

అయితే.. రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు తెలిపారు. మోడీ సూచ‌న‌లో.. ఆయ‌న‌తో ఉన్న అనుబంధ‌మో.. తెలియ‌దుకానీ, ముర్ముకు మ‌ద్ద‌తు తెలిపి.. ఆమెను గ‌ద్దె నెక్కించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూడా ప్ర‌ధాని మోడీ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మోడీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నారు.

సో.. ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లలేదు.. ఆయ‌న‌ను అసలు పిల‌వ‌నూ లేదు. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఆది నుంచి సంపూర్ణ‌మద్ద‌తు ప్ర‌క‌టించారు. ద్రౌప‌ది ముర్మును ఏపీకి పిలిపించి మ‌రీ స‌త్క‌రిం చి.. మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. అంతేకాదు.. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తొలి వ‌రుస‌లోనే ఒడిసా ముఖ్య‌మంత్రి ప‌క్క‌న ఆయ‌న‌కు సీటు కేటాయించారు.

ఇది వాస్త‌వం. అయితే.. సీఎం జ‌గ‌న్‌.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. కార‌ణాలు ఏవైనా కూడా.. ఆయ‌న దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సీటును వేరేవారికి కేటాయించే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆ సీటును ఎవ‌రికీ కేటాయించ‌కుండా.. ఖాళీగా ఉంచేశార‌ని.. వైసీపీ వ‌ర్గాలు చెప్పాయి.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే..కాంగ్రెస్ నేత ఖ‌ర్గేకు.. ఇదే వ‌రుస‌లో చివ‌రి సీటును కేటాయించారు. దీంతో ఆయ‌న అలిగి.. ఖాళీగా ఉన్న‌కుర్చీలో కూర్చుంటాన‌ని కోరార‌ట‌. కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. ఆయ‌న‌కు ఛాన్స్ ద‌క్క‌లేదు
Tags:    

Similar News